Dil Raju : పవన్ కళ్యాణ్ సినిమా ఆపే ధైర్యం ఎవడికీ లేదు.. ప్రభుత్వానికి తప్పుడు సమాచారం వెళ్ళింది.. గత ప్రభుత్వంలో భయపడుతూ..

నిన్న నిర్మాత అల్లు అరవింద్ మీటింగ్ పెట్టగా నేడు దిల్ రాజు మీటింగ్ పెట్టారు.

Dil Raju : పవన్ కళ్యాణ్ సినిమా ఆపే ధైర్యం ఎవడికీ లేదు.. ప్రభుత్వానికి తప్పుడు సమాచారం వెళ్ళింది.. గత ప్రభుత్వంలో భయపడుతూ..

Producer Dil Raju Meeting on Pawan Kalyan Movie Theaters HariHara VeeraMallu Issue

Updated On : May 26, 2025 / 4:11 PM IST

Dil Raju : గత కొన్ని రోజులుగా నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య థియేటర్స్ ఇష్యూ కొనసాగుతుండగా అది అటు ఇటు తిరిగి హరిహరవీరమల్లు సినిమా వైపు వెళ్ళింది. ఈ ఇష్యూ పెద్దది అవడం, కొంతమంది కావాలని హరిహర వీరమల్లు రిలీజ్ సమయంలో థియేటర్స్ బంద్ ప్రస్తావన తేవడం.. లాంటివి చూసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమపై, థియేటర్స్ ఇష్యూపై సీరియస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ కూడా సీరియస్ అయ్యారు. దీనిపైనా నిన్న నిర్మాత అల్లు అరవింద్ మీటింగ్ పెట్టగా నేడు దిల్ రాజు మీటింగ్ పెట్టారు.

ఈ మీటింగ్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. సమస్యలు తీరకపోతే బంద్ చేస్తామన్నారు కానీ బంద్ అని ఎవరూ ప్రకటించలేదు. కొంతమంది ఆ నలుగురు అంటూ నా పేరు బయటకు తెచ్చారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే ధైర్యం ఎవడికి లేదు. గవర్నమెంట్ కి కూడా మ్యాటర్ తప్పుగా వెళ్ళింది. నాతో మినిస్టర్ దుర్గేష్ గారు మాట్లాడారు. నేను చెప్పాను థియేటర్స్ బంద్ లేదు అని. గవర్నమెంట్ కి వెళ్లిన సమాచారం తప్పు అని నేను అనుకుంటున్నాను. రాంగ్ కమ్యూనికేషన్ జరిగింది.

Also Read : Vishnupriya : అందుకే నేను హీరోయిన్ గా చేయకూడదు అని డిసైడ్ అయ్యా.. బాలీవుడ్, తమిళ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి..

సినిమా వాళ్లకు రెండు ప్రభుత్వాలు ముఖ్యం. సీఎం రేవంత్ గారు ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య నువ్వు ఉండాలి అని తెలంగాణ FDC పదవి ఇచ్చారు. నేను బిజీగా ఉన్నాను వద్దు అన్నా నన్నే ఉండమన్నారు. గతంలో ఏపీలో అంతా భయపడుతూ జరిగేది. కళ్యాణ్ గారు వచ్చాక ఛాంబర్ ప్రసిడెంట్ గా నేను, నిర్మాతలం వెళ్లి కలిసాము. ఆయన ఫుల్ సపోర్ట్ చేసారు. టికెట్ రేట్లు పెంచుతున్నారు. అందరం నిర్మాతలు అప్పట్నుంచి వెళ్లి టికెట్ రేట్స్ తెచ్చుకుంటున్నారు. ఆ వారం రోజులకు మన సినిమా కోసం వెళ్తున్నారు. అందరం కలిసి వెళ్ళలేదు. దీని గురించి ఎవరూ ఆలోచించలేదు. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీకి పాజిటివ్ గానే ఉంటాయి. ఇండస్ట్రీలో యూనిటీ ఉండాలి. మాకు యూనిటీ ఉంటేనే ప్రభుత్వాల దగ్గరకు వెళ్ళాలి. ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి అని అన్నారు.

Also Read : Allu Aravind : మరి గత చీఫ్ మినిస్టర్ ని ఎందుకు కలిశారు? పవన్ కళ్యాణ్ – థియేటర్స్ ఇష్యూ పై అల్లు అరవింద్ కామెంట్స్..