Dil Raju
Dil Raju : పవన్ కళ్యాణ్ OG హిట్ తర్వాత OG సీక్వెల్ కూడా చేస్తాను అని ప్రకటించారు. ఉస్తాద్ భగత్ సింగ్ త్వరలో రానుంది. ఈ రెండు సినిమాలే పవన్ చేతిలో ఉన్నాయి. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ మరో సినిమా గురించి రూమర్స్ బాగా వినిపించాయి. పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా ఉంటుందని, మెసేజ్ తో పాటు ఎంటర్టైనింగ్ గా ఆ సినిమా ఉంటుందని, దిల్ రాజు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డేట్స్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి.(Dil Raju)
అలాగే దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారని, సల్మాన్ ఖాన్ – వంశి పైడిపల్లితో ఇంకో సినిమా చేస్తున్నారని, దిల్ రాజు బాలీవుడ్ పై ఫోకస్ చేసాడని పలు వార్తలు వచ్చాయి. ఈ మేరకు నేడు దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసారు.
Also Read : Raju Weds Rambai : సూపర్ హిట్ సినిమా.. రాజు వెడ్స్ రాంబాయిని మిస్ చేసుకున్న నలుగురు హీరోలు ఎవరో తెలుసా..?
ఈ ప్రకటనలో.. గత కొన్ని రోజులుగా దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి రాబోతున్న సినిమాల గురించి చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. పాత వార్తలను కూడా ఇప్పడు జత చేసి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. మేము ఇప్పుడు కేవలం బాలీవుడ్ లో అనీష్ బజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా సినిమా చేస్తున్నాము. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తాము. దయచేసి మా వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా ఎలాంటి రూమర్స్ వ్యాప్తి చేయొద్దు, వార్తలను నమ్మొద్దు అని తెలిపారు.
దీంతో దిల్ రాజు నిర్మాణంలో ప్రస్తుతం అదొక్క సినిమానే ఫైనల్ అయిందని, మిగిలినవి అన్ని రూమర్స్ అని, పవన్ కళ్యాణ్ సినిమా కూడా లేనట్టే అని తెలుస్తుంది. లేదా ప్రస్తుతం వర్క్ జరుగుతున్న సినిమా గురించి మాత్రమే ప్రకటించి, చర్చలు జరుగుతున్న సినిమాల గురించి చెప్పలేదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Actress Hema : ఇప్పుడు అమ్మాయిలకే అబ్బాయిలు భయపడుతున్నారు.. కాస్టింగ్ కౌచ్ పై హేమ ఆసక్తికర వ్యాఖ్యలు..