Raju Weds Rambai : సూపర్ హిట్ సినిమా.. రాజు వెడ్స్ రాంబాయిని మిస్ చేసుకున్న నలుగురు హీరోలు ఎవరో తెలుసా..?
ఇంత పెద్ద హిట్ అయినా సినిమాని నలుగురు హీరోలు వదిలేసుకున్నారట. (Raju Weds Rambai)
Raju Weds Rambai
Raju Weds Rambai : అఖిల్, తేజస్వి జంటగా సాయిలు దర్శకత్వంలో తెరకెక్కిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఇటీవల రిలీజయి పెద్ద హిట్ అయింది. కేవలం 2 కోట్లు పెట్టి తెరకెక్కిస్తే ఈ సినిమా ఆల్మోస్ట్ 20 కోట్లు కలెక్ట్ చేసింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నిజంగా జరిగిన ఓ లవ్ స్టోరీతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో కొత్త హీరో -హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ లకు మంచి ఫేమ్ వచ్చింది.(Raju Weds Rambai)
అయితే ఇంత పెద్ద హిట్ అయినా సినిమాని నలుగురు హీరోలు వదిలేసుకున్నారట. తాజాగా రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ సాయిలు కంపాటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయం తెలిపాడు.
Also Read : Actress Hema : ఇప్పుడు అమ్మాయిలకే అబ్బాయిలు భయపడుతున్నారు.. కాస్టింగ్ కౌచ్ పై హేమ ఆసక్తికర వ్యాఖ్యలు..
సాయిలు కంపాటి మాట్లాడుతూ.. రాహుల్ రామకృష్ణకు 2017 సమయంలోనే ఈ కథని ల్యాప్ టాప్ లో టైప్ చేయించి పంపించాను. అతనికి ఈ కథ ఎక్కలేదు. అతని నుంచి రిప్లై ఏం రాలేదు. రెండు మూడు సార్లు అప్రోచ్ అయ్యాను కానీ వర్కౌట్ అవ్వలేదు. డైరెక్ట్ గా కలిసి నేరేషన్ మాత్రం ఇవ్వలేదు రాహుల్ రామకృష్ణకు. ఆ తర్వాత సుమంత్ ప్రభాస్ కి నేరేషన్ ఇచ్చాను. అతనికి బాగా నచ్చింది కానీ ఎందుకో ఆగిపోయాడు. ఆ తర్వాత పెదకాపు హీరో విరాట్ కర్ణకు చెప్పాను, ఆయనకు కూడా ఈ కథ ఎక్కలేదు. యాంకర్ సుమ కొడుకు రోషన్ కి కూడా చెప్పాను కానీ ఆయనకు కూడా ఈ కథ ఎక్కలేదు అని తెలిపాడు.
అలా ఈ నలుగురు మంచి సినిమాని మిస్ చేసుకున్నారు. దీంతో కొత్త హీరో అఖిల్ ఈ ఛాన్స్ ని సరిగ్గా ఉపయోగించుకొని బాగా నటించి హిట్ అందుకున్నాడు.
Also Read : Samantha : సమంత – రాజ్ పెళ్లి.. వచ్చిన అతిధులకు గిఫ్ట్స్ ఏమిచ్చారో తెలుసా?
