Actress Hema : ఇప్పుడు అమ్మాయిలకే అబ్బాయిలు భయపడుతున్నారు.. కాస్టింగ్ కౌచ్ పై హేమ ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజాగా నటి హేమ కూడా కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలే చేసింది.(Actress Hema)
Actress Hema
Actress Hema : బయట అన్ని ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్నప్పటికీ సినీ పరిశ్రమలోనే జరుగుతుందని ఫోకస్ చేసి మరీ ప్రచారం చేస్తారు. సినిమా వాళ్ళు సెలబ్రిటీలు కావడంతో, గ్లామర్ ఇండస్ట్రీ కావడంతో దీనిపై మాత్రమే ఫోకస్ చేయడంతో ఇక్కడే జరుగుతుందని అంతా అనుకుంటారు. తాజాగా నటి హేమ కూడా కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలే చేసింది.(Actress Hema)
నటి హేమ 10 టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించగా హేమ స్పందించింది.
Also Read : Samantha : సమంత – రాజ్ పెళ్లి.. వచ్చిన అతిధులకు గిఫ్ట్స్ ఏమిచ్చారో తెలుసా?
హేమ మాట్లాడుతూ.. అది పాత విషయం. ఆ జమానా పోయింది. ఇప్పుడు అమ్మాయిలకే అబ్బాయిలు భయపడుతున్నారు. రీసెంట్ గా ఒక హీరోయిన్ కూడా రిపోర్ట్రర్ అడిగితే నేను అయితే ఏం ఫేస్ చేయలేదు అని చెప్పింది. ఇంకో హీరోయిన్ కూడా అదే చెప్పింది. ఇప్పుటి జనరేషన్ వేరు. అప్పటి జనరేషన్ వేరు. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ లాంటివి ఏం లేవు. చదువుకున్న వాళ్ళు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. కేవలం ఇండస్ట్రీ అంటున్నారు కానీ బయట కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది. కానీ సినిమా వాళ్లనే అలా అంటారు. నేను అయితే ఎప్పుడూ అలాంటిది ఫేస్ చేయలేదు. నాతో ఎవరైనా అలా మాట్లాడినా లెఫ్ట్ & రైట్ ఇచ్చేస్తా అని తెలిపింది.
