Dil Raju speech KA success meet viral
Dil Raju : చిన్న సినిమాల ప్రచారానికి సెలబ్రిటీలు రావడం లేదు అనే కామెంట్స్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. సెలబ్రిటీలు రావడం లేదని అంటున్నారు.. రారమ్మా.. ఎందుకు వస్తారు? ఎవరి బిజీ వాళ్లది, ఎవరి లైఫ్ వాళ్లది. వాళ్ల టైమ్ మీ టైమ్‌తో సెట్ అయితే వస్తారు అని దిల్‌రాజు అన్నారు.
క సక్సెస్ మీట్‌లో దిల్ రాజు మాట్లాడాడరు. ఆ మధ్య కిరణ్ అబ్బవరం ఆవేదనను ఓ వీడియోలో చూశాను. నిన్న చిన్న సినిమాల ప్రచారానికి సెలబ్రిటీలు రావడం లేదని కొందరు అంటున్నారు. ఇక్కడ టాలెంట్ ఉంటేనే సక్సెస్ అవుతారు. ఎవరో ఏదో చేస్తారని ఆశించకూడదు. అది తప్పు.
ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయరు. మమ్మల్ని వెనక్కు లాగేస్తున్నారు, సపోర్ట్ చేయరని అంటుంటారు. ఎవ్వరూ వెనక్కు లాగరు, ఎవ్వరూ సపోర్ట్ చేయరు. ఎవరూ ముందుకురారు రారు అని దిల్ రాజు అన్నారు.
ఎమోషనల్ అయితే ఉపయోగం లేదన్నారు. ఇక సక్సెస్ వచ్చినప్పుడు కొంతమంది వచ్చి అభినందిస్తారని, అంతకుమించి ఇండస్ట్రీలో ఎవ్వరూ ఏమీ చేయరన్నారు. ప్రచారానికి సెలబ్రిటీలు వచ్చారా? లేదా అన్నది పాయింట్ కాదు. నువ్వు ఎలా నీ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకువెళ్లావు అనేదే పాయింట్ అని అన్నారు. కంటెంట్ ఉంటే ప్రేక్షకులే సినిమాని ఆదరిస్తారని, కాబట్టి సెలబ్రిటిల కోసం కాకుండా కంటెంట్ తో ప్రేక్షకులను అలరించాలన్నారు.
RC 16 : రామ్‌చరణ్ బుచ్చిబాబు మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆ రోజు నుంచేనా?
Only your hard work and success speaks.
No one will support or pull you back– #DilRaju at #KA success meet pic.twitter.com/3GKmquLavy
— Vamsi Kaka (@vamsikaka) November 8, 2024