Dil Raju Sree Vishnu
Dil Raju : సినీ పరిశ్రమకు ఉన్న పెద్ద కష్టాల్లో పైరసీ ఒకటి. ఎన్నో ఏళ్లుగా పైరసీ సినీ పరిశ్రమకు నష్టాలను తెస్తుంది. సినిమా రిలీజయిన రోజే ఫుల్ సినిమా నెట్ లో వచ్చేస్తుంది. దీనిపై సినీ పెద్దలు ఎప్పట్నుంచో పోరాటం చేస్తున్నారు. మధ్యలో కొన్నాళ్ళు సైలెంట్ అయినా ఇటీవల మళ్ళీ పైరసీ పుంజుకుంటుంది. గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ బారిన పడి తీవ్ర నష్టం చూసింది. దీంతో సినీ పరిశ్రమ పెద్దలు పైరసీ తగ్గించడానికి మరోసారి ఫోకస్ పెట్టారు.
తమ్ముడు ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడగా పైరసీ గురించి ప్రస్తావన వచ్చింది.
Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?
దీంతో దిల్ రాజు మాట్లాడుతూ.. పైరసీ ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఇటీవల శ్రీ విష్ణు సినిమా ‘సింగిల్’ ని ఇక్కడే హైదరాబాద్ థియేటర్లో కూర్చొని షూటింగ్ చేసి పైరసీ చేసారు. ఆ విషయంలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసారు. పైరసీ చేసిన సినిమాని వీళ్ళు అమ్ముతున్నారు. చిన్న సినిమాలు అయితే 400 డాలర్లు, పెద్ద సినిమా అయితే 1000 డాలర్లకు పైరసీ సైట్స్ కి అమ్ముతున్నారు. దాని వల్ల సినిమాకు చాలా నష్టం జరుగుతుంది. వాళ్లకు అదే పెద్ద అమౌంట్ ఆ డబ్బుల కోసం పైరసీ చేస్తున్నారు. కానీ మాకు ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. పైరసీ కంట్రోల్ చేయడానికి అడుగులు వేస్తున్నాం అని తెలిపారు.
దీంతో సినిమాని ఇక్కడే థియేటర్స్ లో షూట్ చేసి పైరసీ సైట్స్ కి అలా అమ్మేస్తున్నట్టు తెలుస్తుంది. చిన్న సినిమా 400 డాలర్లు అంటే సుమారు 32 వేలు, పెద్ద సినిమా 1000 డాలర్లు అంటే సుమారు 80 వేలకు పైన సినిమాని పైరసీ వెబ్ సైట్స్ కి అమ్మేస్తున్నారు.