Solo Boy : బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ ‘సోలో బాయ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. నన్ను ప్రశ్నించే వారికి ఇదే నా సమాధానం..

ఈ సినిమా జులై 4వ తేదీన రిలీజ్ కానుండగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Solo Boy : బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ ‘సోలో బాయ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. నన్ను ప్రశ్నించే వారికి ఇదే నా సమాధానం..

Gautham Krishna Solo Boy Movie Pre Release Event

Updated On : July 2, 2025 / 3:13 PM IST

Solo Boy : సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో బిగ్ బాస్ గౌతం కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా సోలో బాయ్. అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జులై 4వ తేదీన రిలీజ్ కానుండగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి వివి వినాయక్, రఘు కుంచే, కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్.. పలువురు గెస్టులుగా హాజరయ్యారు.

సోలో బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వివి వినాయక్ మాట్లాడుతూ… చిత్ర నిర్మాత సతీష్ ఒక దర్శకునిగా ఇండస్ట్రీకి వచ్చి బట్టల రామస్వామి బయోపిక్ ద్వారా నిర్మాతగా మారారు. చాలా సాధారణ స్థాయి నుండి ఈరోజు నిర్మాతగా మారడానికి ఎంతో కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు. ఈ సినిమాలో నటించిన గౌతమ్ కృష్ణకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Also Read : Prabhas – Allu Arjun : మొన్న అల్లు అర్జున్ సినిమా ఎన్టీఆర్ కు.. ఇప్పుడు ప్రభాస్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేతికి..

డైరెక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ… ఈ సినిమాలో అన్ని రకాల జోనర్లు కనిపిస్తూ ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అవుతుంది. గౌతమ్ కృష్ణ ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా తర్వాత గౌతమ్ కృష్ణకు ఎన్నో పెద్ద సినిమాలు వస్తాయి. సెవెన్ హిల్స్ సతీష్ గారు ప్యాషన్ తో వచ్చి ఎంతో కష్టపడి చిత్ర నిర్మాణానికి సహాయపడుతూ ఉండే మనిషి. ప్రతి విషయంలోనూ ఎంతో సపోర్టుగా నిలిచారు అని తెలిపారు.

Gautham Krishna Solo Boy Movie Pre Release Event

నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ… నాకు చాలా ఎమోషనల్ గా ఉంది. గౌతమ్ కృష్ణ నాకు తమ్ముడి లాంటివాడు. గౌతమ్ ఈ సినిమా కోసం ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. నేను సినిమాకు చాలా కనెక్ట్ అయ్యాను అని తెలిపారు. హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ… నేను బిగ్ బాస్ కు వెళ్లక ముందు ఈ సినిమా మొదలైంది. నాకు అసలు ఫేమ్ లేని సమయంలో నన్ను నమ్మి సతీష్ గారు ఈ సినిమా మొదలుపెట్టారు. మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఎన్నో విషయాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. చిత్ర పరిశ్రమలో ఎటువంటి పరిచయాలు లేకుండా కేవలం బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి ఇలా ఒక సినిమాలో హీరోలా నిలబడటం అనేది చాలా పెద్ద విషయం. నేను దానిని ఒక సక్సెస్ లా చూస్తున్నాను. నన్ను ప్రశ్నించే వారికి ఇదే నా సమాధానం అని తెలిపారు.

Also Read : NTR – Hrithik : ఫ్యాన్స్ కి నిరాశే.. ఎన్టీఆర్, హృతిక్ కలిసి కనపడరట.. ఇలా అయితే ఎలా?