ఖైదీ’ సీక్వెల్ ‘ఢిల్లీ’

కార్తీ నటించిన తమిళ సినిమా.. ‘ఖైదీ’.. దీపావళి కానుకగా అక్టోబర్ 25న తెలుగు, తమిళ్‌లో భారీగా విడుదలైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ రానుంది..

  • Published By: sekhar ,Published On : October 26, 2019 / 09:03 AM IST
ఖైదీ’ సీక్వెల్ ‘ఢిల్లీ’

Updated On : October 26, 2019 / 9:03 AM IST

కార్తీ నటించిన తమిళ సినిమా.. ‘ఖైదీ’.. దీపావళి కానుకగా అక్టోబర్ 25న తెలుగు, తమిళ్‌లో భారీగా విడుదలైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ రానుంది..

కార్తీ నటించిన తమిళ సినిమా.. ‘ఖైదీ’.. దీపావళి కానుకగా అక్టోబర్ 25న తెలుగు, తమిళ్‌లో భారీగా విడుదలైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ‘ఖైదీ’ మూవీకి అన్నిచోట్ల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. ‘ఖైదీ’ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని దర్శకుడు లోకేష్ ప్రకటించారు.

ఒక్క రాత్రిలో జరిగిన కథను హీరోయిన్, సాంగ్స్ లేకుండా.. అద్భుతంగా తెరకెక్కించి ప్రశంసలు పొందిన లోకేశ్ కనకరాజ్.. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పదేళ్లు యావజ్జీవ శిక్ష అనుభవించి బయటకు వచ్చిన కార్తి.. పోలీసులకు సాయం చేసే సందర్భంలో తన గతాన్ని వివరిస్తాడు. తన భార్య ఎలా చనిపోయిందనే విషయాన్ని చెబుతూ బాధ పడతాడు. తన భార్య గర్భవతి అని కూడా చూడకుండా కొందరు దుర్మార్గులు తన ముందే దారుణానికి పాల్పడుతుంటే, వాళ్లలో ఒకరి చంపి తాను జైలుకు వెళ్లానని చెబుతాడు.

Read Also : బాలయ్య పోస్టర్ చూశారు.. బతికిపోయారు.. : ‘మనకథ’ టీజర్

ఇక క్లయిమాక్స్‌ సీన్‌లో కార్తిని చూసి ‘వాడు సంబంధం లేనివాడు కాదురా.. వాడి పేరు ఢిల్లీ’ అంటూ విలన్ చెప్పే డైలాగ్‌పై ప్రేక్షకుల్లో సందేహం వస్తుంది. కార్తి భార్య చనిపోవడం వెనుక డ్రగ్స్ ముఠా నాయకుడైన విలన్ పాత్ర ఉంటుందనే డౌట్ వచ్చేలా డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. అందుకు తగ్గట్లే రెండో భాగం కథను లోకేశ్ కనకరాజ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో కనిపించని హీరోయిన్ రెండో భాగంలో కనిపించే చాన్స్ ఉంది. అయితే హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ‘ఖైదీ’ కి సీక్వెల్ ఉంటుందా అని ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నవారందరికీ నా సమాధానం.. అవును.. ‘ఢిల్లీ విల్ బి బ్యాక్’ అంటూ డైరెక్టర్ ట్వీట్ చేయడంతో ‘ఖైదీ’ సీక్వెల్ కన్ఫమ్ అయిపోయింది.