Dimple hayathi : శంకర్‌ భారీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన డింపుల్‌.. గేమ్ చెంజర్..? ఇండియన్ 2..?

శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చెంజర్, కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాల్లో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే శంకర్ తెరకెక్కించే ఒక సినిమాలో డింపుల్‌ హయాతి బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తుంది.

Dimple hayathi got chance in shankar movie is Game Changer or Indian 2

Dimple hayathi : టాలీవుడ్ హీరోయిన్ డింపుల్‌ హయాతి.. ఇటీవల గోపీచంద్ తో కలిసి ‘రామబాణం’ సినిమాలో నటించి ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేక పోయింది. అంతకుముందు రవితేజ ఖిలాడీ మూవీలో హీరోయిన్ గా చేసిన హిట్ అందలేదు. ఇక ఇటీవల ఒక పోలీస్ కేసుతో కోర్ట్ మెట్టులు ఎక్కి టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి బ్యాడ్ టైం నడుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఈ భామ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది.

Minister Roja : రామ్‌చరణ్ కూతురు పై మంత్రి రోజా ఎమోషనల్ ట్వీట్.. చరణ్‌ని చిన్నప్పుడు ఎత్తుకున్న..

స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చెంజర్ (Game Changer), కమల్ హాసన్ తో ఇండియన్ 2 (Indian 2) సినిమాల్లో చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఏకకాలంలో చిత్రకరణ జరుపుకుంటున్నాయి. గేమ్ చెంజర్ షూటింగ్ ఇంకో 25 శాతం బ్యాలన్స్ ఉండగా.. ఇండియన్ 2 షూటింగ్ మొత్తం దాదాపు పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్ కోసం చిత్ర యూనిట్ డింపుల్ హయతిని సంప్రదించినట్లు తెలుస్తుంది.

Adipurush : బాక్సాఫీస్‌ వద్ద 78 శాతం ఆదిపురుష్ కలెక్షన్స్.. ఇప్పటి వరకు ఎంత వచ్చాయి..

గతంలో ఈ భామ ‘గద్దలకొండ గణేష్‌’లో స్పెషల్ సాంగ్ చేసే అందర్నీ ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఆఫర్ చేసినట్లు సమాచారం. దానికి హయతి కూడా ఒకే చెప్పేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ పాట షూటింగ్ జరగనుంది. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. 1996లో శంకర్ అండ్ కమల్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడుకి ఈ చిత్రం సీక్వెల్ గా తెరకెక్కుతుంది. కాజల్ అగర్వాల్. రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.