Dimple Hayathi interesting comments about Bhartha Mahasayulaku wignyapthi movie
Dimple Hayathi: ఖిలాడీ బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. మాస్ మహారాజ్ రవి తేజ క్లాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల టెకెక్కిస్తున్నాడు. ఆషిక రంగనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈనేపధ్యంలోనే ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచేశారు మేకర్స్. చిత్ర యూనిట్ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డింపుల్(Dimple Hayathi) రవి తేజ గురించి, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా గురించి చాల విషయాలను చెప్పుకొచ్చింది. అలాగే రవి తేజ, డింపుల్ జోడీ గురించి కూడా చెప్పుకొచ్చింది.
Godavari Gattupaina Event: గోదావరి గట్టుపైన మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు
‘రవి తేజ నేను గతంలో ఖిలాడీ మూవీ చేశాము. కానీ, ఆ సినిమా అంతంగా ఆడలేదు. కానీ, ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. గతంలో రవి తేజ ఇలియానా చేసిన ఫస్ట్ మూవీ ఖతర్నాక్ ప్లాప్ అయ్యింది. రెండో సినిమా కిక్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే మా జోడీ కూడా. ఖిలాడీ ప్లాప్ అయ్యింది కదా భర్త మహాశయులకు విజ్ఞప్తి బ్లాక్ బస్టర్ అవడం ఖాయం’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక రవి తేజ విషయానికి వస్తే, గత కొంతకాలంగా ఆయన చేస్తున్న సినిమాలేవి అంతగా ఆడియన్స్ ను ఆకట్టుకోవడం లేదు. రీసెంట్ గా ఆయన చేసిన మాస్ జాతర కూడా ప్లాప్ అయ్యింది. దాంతో, రూటు మార్చిన రవి తేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి క్లాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుంది అనేది చూడాలి.