‘నేను బతికే ఉన్నా.. ఇష్టం వచ్చినట్టు రాయకండి’ : డింపుల్ కపాడియా

మీడియాలో తన ఆరోగ్యం గురించి వస్తున్న కథనాలపై అలనాటి ప్రముఖ నటి డింపుల్ కపాడియా స్పందించారు..

  • Published By: sekhar ,Published On : November 18, 2019 / 12:22 PM IST
‘నేను బతికే ఉన్నా.. ఇష్టం వచ్చినట్టు రాయకండి’ : డింపుల్ కపాడియా

Updated On : November 18, 2019 / 12:22 PM IST

మీడియాలో తన ఆరోగ్యం గురించి వస్తున్న కథనాలపై అలనాటి ప్రముఖ నటి డింపుల్ కపాడియా స్పందించారు..

ఈ రోజుల్లో ఎవరైనా ఒక సెలబ్రెటీ చనిపోయారు అంటే స్వయంగా వారి తాలూకు కుటుంబ సభ్యులు మీడియా ముందుకొచ్చి చెప్తేనే కానీ నమ్మలేని పరిస్థితి.. ఇటీవల కాలంలో ఇలాంటి ఉదంతాలు చాలానే జరిగాయి.. తాజాగా అలనాటి ప్రముఖ నటి డింపుల్ కపాడియా ఆరోగ్య పరిస్థితి గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి..

దీంతో స్వయంగా ఆమే మీడియా ముందుకొచ్చి ఏం జరిగిందో వివరణ ఇచ్చారు.. అసలేం జరిగిందంటే.. డింపుల్‌ పెద్ద కుమార్తె, నటి-రచయిత్రి ట్వింకిల్‌ ఖన్నా ముంబైలోని ఓ హాస్పిటల్ బయట కెమెరా కంట పడింది.. దీంతో డింపుల్‌ అనారోగ్యం బారిన పడ్డారంటూ రూమర్స్ వ్యాపించాయి.. ఆ పిక్స్ చూసి ఎవరికి తోచినట్టు వాళ్లు కథనాలు అల్లేశారు..

Read Also : ‘హి ఈజ్ సో హాట్.. హి ఈజ్ సో క్యూట్.. ఓ బావా’ లిరికల్ సాంగ్

ఈ వార్తలు విన్న డింపుల్ ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ జరిగిన విషయం చెప్పారు.. ‘నేను బాగానే ఉన్నాను.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను.. మా అమ్మ గారు బెట్టీ కపాడియా అనారోగ్యానకి గురయ్యారు.. ఆమెను హాస్పిటల్‌లో జాయిన్ చేశాం.. ప్రస్తుతం కోలుకుంటున్నారు.. ఆమెకు దీర్ఘాయిష్షు ప్రసాదించేలా దేవుణ్ణి ప్రార్థించండి’ అంటూ అభిమానులకు విఙ్ఞప్తి చేశారామె..