Abhiroop Basu : ఆ సినిమాలో ఏముందని ఎగబడుతున్నారు? ‘కాంతార’పై బెంగాలీ డైరెక్టర్ విమర్శలు.. ఆడేసుకుంటున్న నెటిజన్లు..

అభిరూప్ బసు అనే ఓ యువ బెంగాలీ డైరెక్టర్ తాజాగా కాంతార సినిమాపై విమర్శలు చేశాడు. కాంతార సినిమాని ఉద్దేశించి.. అసలు ఆ సినిమాలో ఏముందని జనాలు అంతగా ఎగబడుతున్నారు. నాకైతే............

Director Abhiroop Basu sensational comments on Kanatara movie

Abhiroop Basu :  ఇటీవల వచ్చిన కన్నడ సినిమా కాంతార కన్నడలోనే కాక తెలుగు, హిందీ.. దేశమంతటా భారీ విజయం సాధించింది. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 150 కోట్ల కలెక్షలన్లని రాబట్టి భారీ విజయం సాధించింది. సాధారణ ప్రేక్షకుల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు ఈ సినిమాని అందరూ పొగిడేస్తున్నారు. అయితే తాజాగా ఓ బెంగాలీ డైరెక్టర్ ఈ సినిమాపై విమర్శలు చేశాడు.

అభిరూప్ బసు అనే ఓ యువ బెంగాలీ డైరెక్టర్ తాజాగా కాంతార సినిమాపై విమర్శలు చేశాడు. కాంతార సినిమాని ఉద్దేశించి.. అసలు ఆ సినిమాలో ఏముందని జనాలు అంతగా ఎగబడుతున్నారు. నాకైతే ఆ సినిమా నచ్చలేదు. ఈ సినిమా ప్రజల తెలివితేటల్ని అపహాస్యం చేసింది. ట్విస్టులు కూడా సరిగ్గా లేవు. దేవున్ని నమ్మాలని ప్రజల మీద రుద్దినట్టు ఉంది ఈ సినిమా. అందరూ క్లైమాక్స్ గురించి గొప్పగా పొగుడుతున్నారు. నాకైతే అసలు క్లైమాక్స్ నచ్చలేదు. బోరింగ్ సినిమాని ఎక్కువగా పొగుడుతున్నారు అని అన్నాడు.

Manjima Mohan : ప్రేమలో మంజిమా మోహన్.. ఒకప్పటి స్టార్ హీరో తనయుడితో.. పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

దీంతో అభిరూప్ బసు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో నెటిజన్లు అభిరూప్ ని ఆడేసుకుంటున్నారు. నువ్వు అసలు డైరెక్టర్ అని కూడా ఎవరికీ తెలీదు. నువ్ చేసిన ఒక్క సినిమాకే ఇంతలా మాట్లాడాలా? ఫేమస్ అవ్వడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు, దమ్ముంటే ఇలాంటి ఒక సినిమా తీసి చూపించు అని కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు సినిమా లవర్స్, నెటిజన్లు.