Manjima Mohan : ప్రేమలో మంజిమా మోహన్.. ఒకప్పటి స్టార్ హీరో తనయుడితో.. పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

తాజాగా మంజిమా మోహన్ తన సోషల్ మీడియాలో గౌతమ్ తో కలిసి క్లోజ్ గా దిగిన ఫోటోలని షేర్ చేసింది. గౌతమ్ తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ..............

Manjima Mohan : ప్రేమలో మంజిమా మోహన్.. ఒకప్పటి స్టార్ హీరో తనయుడితో.. పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

manjima mohan open about her love with gautham karthik

Updated On : May 22, 2023 / 11:17 AM IST

Manjima Mohan :  మంజిమా మోహన్ తమిళ్, మలయాళం, తెలుగు సినిమాలతో ప్రేక్షకులకి దగ్గరైంది. తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో మంచిపేరు తెచ్చుకుంది. మంజిమా ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా తన ప్రేమ గురించి అధికారికంగా బయటపెట్టింది. ఒకప్పటి స్టార్ హీరో కార్తిక్ తనయుడు గౌతమ్ కార్తీక్ తో తను ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. గౌతమ్ కూడా తమిళ్ లో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

గౌతమ్, మంజిమా కలిసి దేవరత్తమ్‌ అనే సినిమాలో కలిసి నటించారు. అప్పట్నుంచే వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చాయి. ఆ సినిమాతో వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఆ స్నేహం కాస్త తర్వాత ప్రేమగా మారింది.

Vinaya Prasad : ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ ఇంట్లో దొంగతనం.. బంగారం, నగదు మాయం..

తాజాగా మంజిమా మోహన్ తన సోషల్ మీడియాలో గౌతమ్ తో కలిసి క్లోజ్ గా దిగిన ఫోటోలని షేర్ చేసింది. గౌతమ్ తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ.. ”మూడేళ్ళ క్రితం నా లైఫ్ లోకి వచ్చావు. నాకు నెగిటివ్ పరిస్థితులు ఎదురైనప్పుడు నాకు తోడు ఉన్నావు. నన్ను నాలా ఉండనిచ్చావు. నా మీద ఎంతో ప్రేమ చూపించాను.నీతో అందుకే ప్రేమలో పడిపోయాను. నువ్వు నాకు ఎప్పటికి స్పెషల్” అని పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు సెలబ్రిటీలు వీరికి కంగ్రాట్స్ చెప్తున్నారు.