×
Ad

Adhik Ravichandran : ఇది కదా సక్సెస్ అంటే.. తండ్రి అసిస్టెంట్ డైరెక్టర్.. కొడుకు డైరెక్టర్.. స్టేజిపై తండ్రి గురించి చెప్తూ..

కొడుకు తండ్రికి మించి సక్సెస్ అయితే ఆ తండ్రి ఆనందం వేరే లెవల్లో ఉంటుంది. (Adhik Ravichandran)

Adhik Ravichandran

Adhik Ravichandran : కొడుకు తండ్రికి మించి సక్సెస్ అయితే ఆ తండ్రి ఆనందం వేరే లెవల్లో ఉంటుంది. చాలామంది తనయులు తండ్రి బాటలోనే నడుస్తారు. అలా తండ్రి బాటలోనే నడిచి సక్సెస్ అయి తండ్రిని మించిపోయాడు తమిళ డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్. దర్శకుడిగా త్రిష ఇల్లన నయనతార, అంబనవన్ అసరదావన్ అదంగధావన్, భగీరా, మార్క్ ఆంటోనీ, గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఇలా వరుసగా హిట్స్ కొట్టాడు ఆధిక్ రవిచంద్రన్.(Adhik Ravichandran)

ఆధిక్ రవిచంద్రన్ తండ్రి రవిచంద్రన్ తమిళ్ లో ఎన్నో ఏళ్లుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూనే ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసారు. దర్శకుడిగా ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. కానీ కొడుకు ఆధిక్ డైరెక్టర్ అయ్యాడు. పైగా కొడుకు దర్శకుడిగా చేసిన అన్ని సినిమాలకు రవిచంద్రన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా కూడా పనిచేసాడు. కొడుకు దర్శకుడిగా ఆయన కింద తండ్రి అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసాడు అంటే ఆధిక్ ఏ రేంజ్ సక్సెస్ సాధించాడో తెలిసిపోతుంది. తండ్రి బాటలోనే నడిచిన ఆధిక్ తన తండ్రి పేరుని తన పక్కన చేర్చుకొని ఆధిక్ రవిచంద్రన్ అయ్యాడు.

Also Read : Bunny Vasu : చిరంజీవి భార్యకు బాకీ ఉన్న బన్నీ వాసు.. 20 ఏళ్ళ క్రితం తీసుకొని.. ఎంతో తెలుసా?

తాజాగా ఓ అవార్డు ఈవెంట్లో ఆధిక్ రవిచంద్రన్ కి అవార్డు వస్తే తనతో పాటు అతని తండ్రిని కూడా పైకి తీసుకు వచ్చాడు. ఆధిక్ స్టేజిపై తన తండ్రి గురించి మాట్లాడుతూ.. అసిస్టెంట్ డైరెక్టర్ గా 25 సంవత్సరాలకు పైగా పనిచేసారు మా నాన్న. నా తండ్రి త్వరలో డైరెక్టర్ అవుతారు. నేను అందులో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తాను అని తెలిపాడు. అలాగే స్టేజిపై డైరెక్టర్ అనే చైర్ తెప్పించి అందులో తండ్రిని కుర్చోపెట్టాడు ఆధిక్. దీంతో రవిచంద్రన్ ఎమోషనల్ అయ్యాడు.

కొడుకు సక్సెస్ అవ్వడమే కాకుండా తండ్రి ఎప్పటికైనా డైరెక్టర్ అవుతాడు, ఆయన కింద తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తాను అని చెప్పడంతో ఆధిక్ గ్రేట్ అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు.

Also Read : Kantara Collections : వాట్.. మూడు రోజుల్లోనే ఇన్ని కోట్లు వచ్చాయా? కాంతార ఛాప్టర్ 1 కలెక్షన్స్..