Kantara Collections : వాట్.. మూడు రోజుల్లోనే ఇన్ని కోట్లు వచ్చాయా? కాంతార ఛాప్టర్ 1 కలెక్షన్స్..

కాంతార ఛాప్టర్ 1 సినిమా మొదటి రోజు కేవలం 89 కోట్ల గ్రాస్ వచ్చింది. (Kantara Collections)

Kantara Collections : వాట్.. మూడు రోజుల్లోనే ఇన్ని కోట్లు వచ్చాయా? కాంతార ఛాప్టర్ 1 కలెక్షన్స్..

Kantara Collections

Updated On : October 5, 2025 / 6:48 PM IST

Kantara Collections : రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతార ఛాప్టర్ 1 సినిమా ఇటీవల అక్టోబర్ 2న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది. కన్నడలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా మిగిలిన చోట్ల మాత్రం పర్వాలేదు అనిపించుకుంది. అయితే దసరా హాలిడేస్ ఉండటం కాంతారకు బాగా కలిసొచ్చింది.(Kantara Collections)

కాంతార ఛాప్టర్ 1 సినిమా మొదటి రోజు కేవలం 89 కోట్ల గ్రాస్ వచ్చింది. అయితే తాజాగా మూవీ యూనిట్ మూడు రోజుల కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు. కాంతార ఛాప్టర్ 1 సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 235 కోట్లు కలెక్ట్ చేసినట్టు అనౌన్స్ చేశారు. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మొదటి రోజు 89 కోట్లు వస్తే రెండు రోజుల్లోనే 146 కోట్లు వచ్చాయా అని షాక్ అవుతున్నారు. దసరా హాలిడేస్ వల్లే కాంతార ఛాప్టర్ 1 కి బాగా కలిసొచ్చిందేమో అంటున్నారు.

Also Read : Rashmika Vijay : రష్మిక – విజయ్.. ఎవరి ఆస్తి ఎన్ని కోట్లు తెలుసా? ఎవరిది ఎక్కువ? ఎవరికి ఏం బిజినెస్ లు ఉన్నాయి?

అలాగే ఇవాళ ఆదివారం కూడా బుకింగ్స్ బాగానే ఉన్నాయని, ఇంకా హాలిడేస్ కాబట్టి ఫ్యామిలీలు వెళ్తున్నారని, రేపట్నుంచి చూడాలి ఎంత వస్తాయో అని బాక్సాఫీస్ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. తెలుగులో కూడా ఈ దసరాకు స్ట్రైట్ సినిమా ఏమి లేకపోవడంతో కాంతార ఛాప్టర్ 1 కి కలిసొచ్చింది అంటున్నారు. మరి ఓవరాల్ గా కాంతార ఛాప్టర్ 1 సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో, కాంతార 400 కోట్ల కలెక్షన్ ని దాటుతుందా చూడాలి.

Rishab Shetty Kantara Chapter 1 Movie Three Days Collections

Also Read : Mahesh Vitta : ‘డాకు మహారాజ్’లో చివరి నిమిషంలో నన్ను తీసేసారు.. నా బదులు ఆ కమెడియన్ ని తీసుకొని..