Mahesh Vitta : ‘డాకు మహారాజ్’లో చివరి నిమిషంలో నన్ను తీసేసారు.. నా బదులు ఆ కమెడియన్ ని తీసుకొని..
బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలో నన్ను తీసుకొని చివరి నిమిషంలో తీసేశారని ఆ సంఘటన గురించి తెలిపాడు. (Mahesh Vitta)

Mahesh Vitta
Mahesh Vitta : ఫన్ బకెట్ కామెడీ సిరీస్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు మహేష్ విట్టా. ఆ తర్వాత సినిమాల్లో పాత్రలు చేస్తూ బిగ్ బాస్ లో పాల్గొని బాగానే పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం మహేష్ విట్టా సినిమాల్లో కమెడియన్ గా నటిస్తున్నాడు. హీరోగా కూడా ఓ సినిమా చేస్తున్నాడు.(Mahesh Vitta)
తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మహేష్ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలో నన్ను తీసుకొని చివరి నిమిషంలో తీసేశారని ఆ సంఘటన గురించి తెలిపాడు.
మహేష్ విట్టా మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఒకరు ఎదగడానికి ఇంకొకరిని తొక్కేయడం జరుగుతుంటాయి. అవి మాములే ఇక్కడ. ఇలాంటివి ఎక్కువగా మేనేజర్స్ చేస్తారు. డాకు మహారాజ్ సినిమాలో మొదట ఓ పాత్రకు నన్ను అనుకున్నారు. అంతా మాట్లాడుకున్నారు. రెమ్యునరేషన్, డేట్స్ అన్ని ఓకే అయ్యాయి. ఊటీలో షూటింగ్. నేను రేపు ఊటీకి వెళ్ళాలి. ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేసి ఆ పాత్ర సత్య గారు చేస్తున్నారు అని, నన్ను తేసేసినట్టు చెప్పారు. అప్పుడు నేను సత్య అంత చిన్న పాత్ర చేసేంత ఖాళీగా ఉన్నాడా అనిపించింది. అది చాలా చిన్న పాత్ర ఓ మూడు నాలుగు సీన్స్ ఉంటాయి. కానీ అది ముందే ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే నన్ను టైం పాస్ కి పిలిచారు. రాయలసీమ కుర్రాడు పాత్ర అనుకోని నన్ను తీసుకున్నారు. ఎవరు ఏం చేసారో తెలీదు కానీ చివర్లో నన్ను తీసేసారు అని తెలిపాడు.
అలాగే మరో సంఘటన గురించి చెప్తూ.. ఓ మూవీ లో పాత్ర అన్నారు. సెలెక్ట్ చేశారు. ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ లో నా పోస్టర్ కూడా వేశారు. ఆఫీస్ లో పూజ అయింది. ప్రెస్ మీట్ పెట్టారు. నేను వెళ్ళాను. అన్ని బాగానే ఉన్నాయి. కానీ చివరకు డేట్స్ అడిగిన తర్వాత పేమెంట్ గురించి అడిగితే డబ్బులేంటి అన్నారు. ఇది మన సినిమా దీనికి డబ్బులు ఉండవు అన్నారు. నేను ఫ్రీగా అయితే చేయను డబ్బులిస్తేనే చేస్తాను అన్నాను. డబ్బులకు అయితే వద్దు అన్నారు. బయటకు వచ్చేసా. కానీ వాడు మంచి పని చేసాడు ముందే చెప్పాడు ఇవ్వను అని. కొంతమంది అయితే షూటింగ్ అయ్యాక డబ్బులు ఇవ్వరు, ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయరు. అలా చాలా మంది, చాలా ప్రొడక్షన్ హౌస్ లు డబ్బులు ఎగ్గొట్టారు నాకు అని తెలిపారు.
Also Read : Mahesh Vitta : ఫేమ్ ఉంది కానీ సొంత ఇల్లు లేదు.. డబ్బులు మొత్తం సినిమాలో పెట్టేసా.. చాలా మంది మోసం చేసి..