Vijay Deverakonda : నిశ్చితార్థం తర్వాత ఆశీర్వాదం తీసుకోడానికి అక్కడికి వెళ్లిన విజయ్ దేవరకొండ.. రష్మిక రాలేదా?

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఇటీవల అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారని విజయ్ టీమ్ మీడియాకు న్యూస్ అందించారు. (Vijay Deverakonda)

Vijay Deverakonda : నిశ్చితార్థం తర్వాత ఆశీర్వాదం తీసుకోడానికి అక్కడికి వెళ్లిన విజయ్ దేవరకొండ.. రష్మిక రాలేదా?

Vijay Deverakonda

Updated On : October 5, 2025 / 4:44 PM IST

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఇటీవల అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారని విజయ్ టీమ్ మీడియాకు న్యూస్ అందించారు. దీంతో ఎప్పట్నుంచో వీళ్ళు ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేసుకుంటున్నారు అనే వార్తలకు తెరపడి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని క్లారిటీ వచ్చేసింది. ఫ్యాన్స్, నెటిజన్లు కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.(Vijay Deverakonda)

అయితే నిశ్చితార్థం తర్వాత విజయ్ దేవరకొండ తాను చిన్నప్పుడు చదువుకున్న ప్లేస్ పుట్టపర్తికి వెళ్ళాడు. విజయ్ చిన్నప్పుడు పుట్టపర్తి సత్య సాయిబాబా హాస్టల్ లో ఉండి చదువుకున్న సంగతి తెలిసిందే. విజయ్ ఇంట్లో కూడా పుట్టపర్తి సాయిబాబాని నమ్ముతారు. దీంతో నిశ్చితార్థం తర్వాత విజయ్ పుట్టపర్తి సాయి బాబా సమాధి వద్ద ఆశీర్వాదం తీసుకోడానికి వెళ్ళాడు. అలాగే అక్కడ తాను చదివిన స్కూల్ ని కూడా సందర్శించినట్టు సమాచారం.

Also Read : Mahesh Vitta : ఫేమ్ ఉంది కానీ సొంత ఇల్లు లేదు.. డబ్బులు మొత్తం సినిమాలో పెట్టేసా.. చాలా మంది మోసం చేసి..

విజయ్ పుట్టపర్తిలో కార్ లోంచి దిగుతున్న ఓ వీడియోని షేర్ చేసి ఈ విషయాన్ని విజయ్ పీఆర్వో సోషల్ మీడియాలో తెలిపారు. అయితే రష్మిక వీడియోలో కనపడకపోవడంతో రష్మిక రాలేదా పుట్టపర్తికి అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్ నెటిజన్లు.

 

View this post on Instagram

 

A post shared by PRO Sreenu Suresh (@pro_sreenusuresh)

Also See : OG సినిమాలో ఎడిటింగ్ లో తీసేసిన సాంగ్ విన్నారా? నేహాశెట్టి అందాలతో..