Rashmika Vijay : రష్మిక – విజయ్.. ఎవరి ఆస్తి ఎన్ని కోట్లు తెలుసా? ఎవరిది ఎక్కువ? ఎవరికి ఏం బిజినెస్ లు ఉన్నాయి?

ఈ జంట ఇద్దరికీ ఎంత ఆస్తి ఉంది, వీళ్లకు ఎన్ని బిజినెస్ లు ఉన్నాయి, వీళ్లిద్దరు కలిస్తే ఎంత ఆస్తి అవుద్ది అని సోషల్ మీడియాలో చర్చగా మారింది.

Rashmika Vijay : రష్మిక – విజయ్.. ఎవరి ఆస్తి ఎన్ని కోట్లు తెలుసా? ఎవరిది ఎక్కువ? ఎవరికి ఏం బిజినెస్ లు ఉన్నాయి?

Rashmika Vijay

Updated On : October 5, 2025 / 6:21 PM IST

Rashmika Vijay : రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ ఇటీవల అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారని వాళ్ళ టీమ్ మీడియాకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. గీత గోవిందం సమయంలో వీరిద్దరికి పరిచయం అయింది. డియర్ కామ్రేడ్ సమయంలో వీరి బంధం మరింత బలపడింది.(Rashmika Vijay)

వీళ్ళు ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారు, డేటింగ్ లో ఉన్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. వీళ్ళు హింట్స్ ఇస్తూ వెకేషన్ కి వెళ్లిన ఫొటోలు, పండగల ఫొటోలు షేర్ చేస్తూనే ఉన్నారు. మొత్తానికి ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. దీంతో ఈ జంటకు ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇద్దరూ కెరీర్లో మంచి పొజిషన్ లో ఉండి వరుస సినిమాలతో దూసుకెల్తూ బాగానే సంపాదిస్తున్నారు.

Also Read : Mahesh Vitta : ‘డాకు మహారాజ్’లో చివరి నిమిషంలో నన్ను తీసేసారు.. నా బదులు ఆ కమెడియన్ ని తీసుకొని..

ఈ జంట ఇద్దరికీ ఎంత ఆస్తి ఉంది, వీళ్లకు ఎన్ని బిజినెస్ లు ఉన్నాయి, వీళ్లిద్దరు కలిస్తే ఎంత ఆస్తి అవుద్ది అని సోషల్ మీడియాలో చర్చగా మారింది. గతంలో పలు నివేదికలు ఇచ్చిన వివరాల ప్రకారం వీరిద్దరి ఆస్తుల గురించి చర్చిస్తున్నారు.

Rashmika Vijay

పలు నివేదికల ప్రకారం విజయ్ దేవరకొండ నెట్ వర్త్ దాదాపు 70 కోట్ల పైనే అట. విజయ్ సినిమాల్లో సంపాదించడం మొదలుపెట్టాక మొదట తన కలల ఇంటిని కట్టుకున్నాడు. దాని విలువ దాదాపు 15 కోట్లు ఉంటుందని సమాచారం. అలాగే విజయ్ చేతిలో పలు బ్రాండ్స్ ఉన్నాయి. వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ ఒక్కోదానికి కోటి రూపాయలు తీసుకుంటాడని టాక్. ఇక సినిమాల పరంగా విజయ్ ఒక్కో సినిమాకు దాదాపు 12 నుంచి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడట. అలాగే విజయ్ కి రౌడీ వేర్ అనే క్లాతింగ్ బిజినెస్ ఉంది. మహబూబ్ నగర్ లో విజయ్ కి AVD సినిమాస్ అని మల్టీప్లెక్స్ థియేటర్ ఉంది. అంతే కాకుండా ఓ వాలీబాల్ టీమ్ కి కో ఓనర్ కూడా. కింగ్ ఆఫ్ ది హిల్ అనే సినిమా నిర్మాణ సంస్థ కూడా ఉంది. అలాగే పలు బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టాడని సమాచారం. ఖరీదైన కార్లు అదనం.

Also Read : Vijay Deverakonda : నిశ్చితార్థం తర్వాత ఆశీర్వాదం తీసుకోడానికి అక్కడికి వెళ్లిన విజయ్ దేవరకొండ.. రష్మిక రాలేదా?

ఇక రష్మిక మందన్న విషయానికి వస్తే.. ఆమెకు దాదాపు 66 కోట్లకు పైగా నెట్ వర్త్ ఉందని పలు నివేదికల సమాచారం. రష్మిక ప్రస్తుతం ఒక్కో సినిమాకు 4 నుంచి 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. బాలీవుడ్ లో అయితే ఇంకా ఎక్కువే. ఇక రష్మిక ఇటీవలే ఓ పెర్ఫ్యూమ్ బ్రాండ్ తో బిజినెస్ మొదలుపెటింది. రష్మిక చేతిలో కూడా దాదాపు ఎనిమిది బ్రాండ్స్ ఉన్నాయి. వీటికి బ్రాండ్ అంబాసిడర్ గా బాగానే సంపాదిస్తుంది. అలాగే ఆమె కుటుంబానికు చెందిన వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టింది. బెంగుళూరులో 8 కోట్ల విలువైన ఇల్లు ఉంది. ఖరీదైన కార్లు కూడా. ఇక ఈ ఇద్దరికీ సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా కూడా డబ్బులు బాగానే వస్తాయి. మొత్తానికి విజయ్ – రష్మిక కలిస్తే దాదాపు 140 కోట్లకు పైగా నెట్ వర్త్ అవుతుందని అంచనా వేస్తున్నారు.