Director Aditya Dhar interesting comments about Dhurandhar movie success
Dhurandhar: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ దురంధర్ థియేటర్స్ లో అదరగొడుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. కేవలం ఇండియాలోనే కాదు అరబ్ దేశాలన్నీ దురంధర్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాయి. అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే, ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ క్యూ కడుతున్నారు. దురంధర్ సినిమా విడుదల అయ్యి 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ ఆ జోష్ తగ్గడం లేదు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.940 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మరో రెండు మూడు రోజుల్లో రూ.1000 కోట్ల క్లబ్ లో చేరనుంది ఈ సినిమా. దీంతో, దర్శకుడు ఆదిత్య ధర్ ఆనందం వ్యక్తం చేశారు.
The Odyssey Trailer: క్రిస్టోఫర్ నోలన్ విజువల్ మ్యాజిక్.. దుమ్ములేపుతున్న ‘ది ఒడిస్సీ’ ట్రైలర్..
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మా దురంధర్(Dhurandhar) సినిమాకు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు మా సినిమాకు కోటికి పైగా టికెట్స్ తెగాయి. అయితే, మా సినిమా విడుదల సమయంలో చాలా మంది కార్పొరేట్ బుకింగ్ అని చాలా కామెంట్స్ చేశారు. కానీ, అలాంటి వాళ్ళు ఇప్పుడు మా సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి నోళ్లు మెదపడం లేదు. ఆడియన్స్ ఈ సినిమాకు చిరస్మరణీయ విజయాన్ని ఇచ్చారు. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు. దీంతో ఆదిత్య ధర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక దురంధర్ సినిమా విషయానికి వస్తే, ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటించాడు. సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. దేశ భక్తి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం ఇక్కడ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ, తెలుగు డబ్బింగ్ రిలీజ్ పై మాత్రం మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తెలుగులో విడుదల అయితే దురంధర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.