The Odyssey Trailer: క్రిస్టోఫర్ నోలన్ విజువల్ మ్యాజిక్.. దుమ్ములేపుతున్న ‘ది ఒడిస్సీ’ ట్రైలర్..
హాలీవుడ్ క్లాసికల్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న సినిమా 'ది ఒడిస్సీ(The Odyssey Trailer)'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
Christopher Nolan The Odyssey movie trailer has been released.
The Odyssey Trailer: ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్, టెనెట్, ఓపన్ హీమర్ లాంటి సినిమా చేసిన హాలీవుడ్ క్లాసికల్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. తెరపై తన విజువల్స్ తో మ్యాజిక్ చేయడం ఈ దర్శకుడుకి వెన్నతో పెట్టిన విద్య. ఈ దర్శకుడు చేసిన ఒక్కో సినిమా ఒక్కో వండర్ అనే చెప్పాలి. అందుకే క్రిస్టోఫర్ నోలన్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. తాజాగా ఈ దిగ్గజ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా ‘ది ఒడిస్సీ(The Odyssey Trailer)’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే మరోసారి తన మార్క్ చుపించావబోతున్నారు నోలన్ అని క్లియర్ గా అర్థమవుతోంది. ఒక్కో విజువల్, ఒక్కో ఫేమ్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
Chinmayi: మెట్టెలు పెట్టుకొని తిరుగు.. శివాజీకి కౌంటర్ ఇచ్చిన చిన్మయి..
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రముఖ రచయిత హోమర్ రాసిన గ్రీకు మహాకావ్యం ‘ది ఒడిస్సీ’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ట్రోజన్ యుద్ధం ముగించుకున్న ‘ఒడిస్సియస్’ తన స్వస్థలం ఇథాకాకు బయల్దేరతాడు. అందుకోసం ఏకంగా పదేళ్లపాటు సముద్ర ప్రయాణం చేస్తాడు. ఆ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సమస్యలు, గ్రీకు దేవతలు, రాక్షసులతో చేసిన పోరాటం.. వీటన్నినీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు నోలన్. ఈ సినిమాలో ఒడిస్సియస్‌గా మ్యాట్ డామన్ నటిస్తుండగా.. టామ్ హాలండ్, యాన్ హాత్వే, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్ వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ‘ది ఒడిస్సీ’ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
