Chinmayi: మెట్టెలు పెట్టుకొని తిరుగు.. శివాజీకి కౌంటర్ ఇచ్చిన చిన్మయి..

శివాజీ హీరోయిన్స్ బట్టలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ పై సింగర్ చిన్మయి(Chinmayi) కౌంటర్ ఇచ్చారు.

Chinmayi: మెట్టెలు పెట్టుకొని తిరుగు.. శివాజీకి కౌంటర్ ఇచ్చిన చిన్మయి..

Chinmayi gave a counter-response to Shivaji's comments on the heroines dresses.

Updated On : December 23, 2025 / 11:19 AM IST

టాలీవుడ్ నటుడు శివాజీ హీరోయిన్స్ బట్టలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆడవాళ్లు నిండుగా బట్టలు వేసుకుంటేనే వారికి గౌరవం అంటూ చెప్పుకొచ్చాడు. నిన్న జరిగిన దండోరా ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. హీరోయిన్స్ పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు. ఆ దరిద్రాన్ని మళ్ళీ మనమే భరించాలి. ఆడవాళ్ళ అందం అనేది చీరల్లో, నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది. అప్పుడే వారి గౌరవం పెరుగుతుంది. పొట్టి బట్టలు వేసుకుంటే పైకి బాగుంది అంటారు. లోపల తిట్టుకుంటారు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా కనిపిస్తే అంత గౌరవం. మహానటి సావిత్రి, సౌందర్య లాంటి హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. గ్లామర్ ఒక దశవరకు మాత్రమే ఉండాలి” అంటూ చెప్పుకొచ్చాడు.

హీరోయిన్ల దుస్తులపై శివాజీ కామెంట్స్.. జుగుప్పాకరమైన వ్యాఖ్యలు..

అయితే, ఈ మాటలు చెప్పే నేపధ్యంలో ఆయన ‘దరిద్రపు ముండ’ లాంటి పదాలు వాడారు. ఇప్పుడు ఈ పదాలు వాడటంపై సింగర్ చిన్మయి స్పందించారు. ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.. “మీరు జీన్స్, హూడీలు వేసుకొని తిరుగుతారు. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలా? మీకు భారతీయ సంస్కృతి మీద అంతగా ప్రేమ ఉంటే ధోవతులు కట్టుకుని, బొట్టు పెట్టుకుని, మెట్టెలు వేసుకుని తిరగండి” అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో చిన్మయి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే, చిన్మయి చేసిన ఈ పోస్ట్ పై కూడా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా బాగా చెప్పారు అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరేమో శివాజీ చెప్పిన దాంట్లో తప్పు ఏముంది. అమ్మాయిలు పద్దతిగా ఉంటేనే గౌరవంగా ఉంటుంది. అలాగే అక్కడ మ్యాటర్ ప్యాంట్, హుడీలు కాదు. ఒకవేళ అవే అనుకున్నా అవి శరీరం నిండుగా ఉంటాయి. పొట్టి బట్టలు కాకుండా ఏవైనా అని ఆయన అర్థం అంటూ శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుంది అనేది చూడాలి.