హీరోయిన్ల దుస్తులపై శివాజీ కామెంట్స్.. జుగుప్పాకరమైన వ్యాఖ్యలు..

నటుడు శివాజీ (Shivaji)మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు. హీరోయిన్స్ పొట్టి పొట్టి బట్టలు కాకుండా కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

హీరోయిన్ల దుస్తులపై శివాజీ కామెంట్స్.. జుగుప్పాకరమైన వ్యాఖ్యలు..

Actor Shivaji made shocking comments about the heroine dresses.

Updated On : December 23, 2025 / 10:31 AM IST

Shivaji: నటుడు శివాజీ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు. హీరోయిన్స్ పొట్టి పొట్టి బట్టలు కాకుండా కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. శివాజీ(Shivaji) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘దండోరా’. దర్శకుడు మురళికాంత్ దేవసోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నవదీప్, బిందు మాధవి, మౌనిక తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nayan Sarika: వృషభ ఈవెంట్ లో నయన్ సారిక.. ఎంత క్యూట్ ఉందో చూడండి.. ఫోటోలు

ఈ నేపధ్యంలోనే తాజాగా దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో నటుడు శివాజీ మాట్లాడుతూ హీరోయిన్స్ డ్రెస్సులు గురించి ప్రస్తావించారు. “ఈ ఈవెంట్ కి యాంకర్ గా చేసిన స్రవంతి డ్రెస్ సెన్స్ బాగుంది. హీరోయిన్స్ కూడా ఎలా బడితే అలా బట్టలు వేసుకోకూడదు. ఆ దరిద్రం మళ్ళీ మనమే అనుభవించాల్సి ఉంటుంది. నిజంగా ఆడవాళ్ళ అందం అనేది చీరల్లో, నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది. అప్పుడే వారి గౌరవం పెరుగుతుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే పైకి నవ్వుతూ బాగుంది అంటారు.

కానీ లోపల మాత్రం మంచి బట్టలు వేసుకోవచ్చుగా అని తిట్టుకుంటారు. స్త్రీ అంటే ప్రకృతితో సమానం. అందుకే ఆమె ఎంత అందంగా కనిపిస్తే అంత గౌరవం పెరుగుతుంది. మహానటి సావిత్రి, సౌందర్య లాంటి హీరోయిన్స్ చాలా మంది మన ఇండస్ట్రీలో ఉన్నారు. గ్లామర్ కుడి లోక దశవరకు మాత్రమే ఉండాలి” అంతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు శివాజీ. దీంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.