Director Anil Ravipudi Next Movie With Ramcharan
Anil Ravipudi : ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీస్‌కు కేరాఫ్‌గా పేరున్న అనిల్ రావిపూడి.. ఈ మధ్యే మెగాస్టార్ చిరంజీవితో ఓ మూవీని కంప్లీట్ చేశాడు. దీంతో ఇప్పటి వరకు మెగా అనిల్ అంటూ హ్యాష్ ట్యాగ్ నడుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తాడంటూ జరుగుతున్న ప్రచారానికి ఓ క్లారిటీ వస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీని గురించి అనిల్ రావిపూడి ఇన్ డైరెక్ట్‌గా చెప్పకనే చెప్పాడు. రామ్‌చరణ్‌తో సినిమా చేయాలన్నది తన కోరిక అన్న అనిల్ రావిపూడి.. చెర్రీతో మూవీ అంటే పాన్ ఇండియా మూవీ అయి ఉండాలని చెప్పుకొచ్చాడు. అయితే అనిల్ మూవీస్ అంటే హీరో పక్కా ఫ్యామిలీ మెన్‌గా, పుల్ కామెడీ ఎంటర్ టైన్‌మెంట్ ఇచ్చేలా మౌల్డ్ కావాలి.
మరి రామ్‌చరణ్‌తో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో తీసుకురావడం కష్టమంటున్నారు. అయితే అనిల్ కూడా రామ్‌చరణ్ పాన్ ఇండియా స్థాయికి తగ్గట్లుగా స్టోరీ రెడీ చేసుకుంటున్నట్లు టాక్. ప్రస్తుతం చెర్రీ పెద్ది సినిమా చేస్తున్నాడు. ఇది పక్కా ఊర మాస్ సినిమా, ఇక దీని తర్వాత సుకుమార్‌తో ఓ సినిమా కన్ఫామ్ అయింది. సుక్కుతో ప్రాజెక్ట్ పూర్తి చేశాక.. అనిల్ రావిపూడితో రామ్‌చరణ్ చేసే అవకాశాలున్నాయంటున్నారు. అన్నీ కుదిరితే వచ్చే సంక్రాంతికి అనిల్, రామ్‌చరణ్ సినిమా రిలీజ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు.