Roja Sekhar Master : మళ్ళీ శేఖర్ మాస్టర్ తో ఎంట్రీ ఇచ్చిన రోజా.. ఆ ఇద్దరితో కలిసి పండక్కి రచ్చే.. ప్రోమో వైరల్..
చాన్నాళ్ల గ్యాప్ తర్వాత శేఖర్ మాస్టర్ - రోజా కలిసి ఎంట్రీ ఇచ్చారు. (Roja Sekhar Master)
Roja Sekhar Master
Roja Sekhar Master : సెకండ్ ఇన్నింగ్స్ లో టీవీ షోలతో అదరగొట్టిన రోజా మధ్యలో మంత్రి అవ్వడంతో గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ గత కొన్నాళ్లుగా అప్పుడప్పుడు టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేస్తుంది. గతంలో శేఖర్ మాస్టర్ – రోజా కాంబినేషన్ సూపర్ హిట్. ఈ ఇద్దరూ కలిసి స్కిట్స్, డ్యాన్సులు కూడా చేసి సందడి చేసారు.(Roja Sekhar Master)
మళ్ళీ చాన్నాళ్ల గ్యాప్ తర్వాత శేఖర్ మాస్టర్ – రోజా కలిసి ఎంట్రీ ఇచ్చారు. జీ తెలుగు సంక్రాంతికి చేసిన స్పెషల్ ప్రోగ్రాంలో ఈ ఇద్దరూ ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో శేఖర్ మాస్టర్ – రోజా కలిసి ఎంట్రీ ఇచ్చి ఛాలెంజ్ చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఓ స్కిట్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది.
Also Read : Director Maruthi : నిర్మాతలకు నచ్చినట్టు కథలు మార్చాల్సి వస్తుంటుంది.. మారుతి సంచలన వ్యాఖ్యలు..
ఇక ఈ ప్రోగ్రాంకి సుధీర్, ప్రదీప్ కలిసి వచ్చారు. ఈ ఇద్దరిలో ఒకరు ఉంటేనే సందడి ఇక ఇద్దరు ఉంటే రచ్చే. అలాగే రాజాసాబ్ హీరోయిన్స్, రవితేజ కూడా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ ప్రోగ్రాంకి హాజరయినట్టు చూపించారు. దీంతో చాన్నాళ్ల తర్వాత శేఖర్ మాస్టర్ – రోజా.. ప్రదీప్, సుధీర్ తో కలిసి సందడి చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రాం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
శేఖర్ మాస్టర్ – రోజా స్పెషల్ సంక్రాంతి ప్రోమో మీరు కూడా చూసేయండి..
Also Read : Director Maruthi : శివాజీ చెప్పింది మంచి విషయం.. నచ్చితే తీసుకో.. మారుతి వ్యాఖ్యలు వైరల్..
