Director Maruthi : శివాజీ చెప్పింది మంచి విషయం.. నచ్చితే తీసుకో.. మారుతి వ్యాఖ్యలు వైరల్..
రాజాసాబ్ డైరెక్టర్ మారుతి 10 టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు. (Director Maruthi)
Director Maruthi
- డైరెక్టర్ మారుతీ ఇంటర్వ్యూ
- శివాజీ ఇష్యూ పై స్పందన
- మారుతీ కామెంట్స్ వైరల్
Director Maruthi : ఇటీవల శివాజీ ఓ సినిమా ఈవెంట్లో హీరోయిన్స్ మంచి బట్టలు వేసుకోండి, చీరలు కట్టుకోండి అని అన్నారు. అయితే మంచి విషయమే చెప్పినా ఆవేశంగా చెప్తూ ఓ రెండు తప్పుడు పదాలు వాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మరి పెద్ద గొడవే అయింది. దీనిపై పలువురు సెలబ్రిటీలు శివాజీ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు. కానీ సోషల్ మీడియా, జనాలు మాత్రం శివాజీకే సపోర్ట్ చేసారు.(Director Maruthi)
అయితే శివాజీ ఈ కామెంట్స్ నిధి అగర్వాల్ పై జనాలు పడి మిస్ బిహేవ్ చేయడం వల్లే చేశాను అని చెప్పారు. దీంతో రాజాసాబ్ డైరెక్టర్ మారుతి 10 టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు.
Also See : Ram Charan : బేబీ బంప్ తో ఉపాసన.. చరణ్ ఇంట్లో బిర్యానీ పండగ.. ఫొటోలు వైరల్..
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. నిధి అగర్వాల్ సంఘటన అనుకోకుండా జరిగింది. ఎక్కువ జనాలు ఉండటంతో తోపులాట జరిగి మీద పడ్డారు. ఎవరూ కావాలని చేయరు. నేను కూడా అక్కడ ఉన్నాను. నా మీదకు కూడా జనం వచ్చారు. జనాలు నడుస్తుంటే వీళ్లకు దగ్గరగా ఉన్నవాళ్లు మీద పడ్డారు. సెక్యూరిటీ వాళ్ళు కూడా ఆపలేకపోయారు. దాంతో ఇబ్బందిగా ఫీల్ అయింది నిధి.
ఆ తర్వాత శివాజీ చెప్పిన విషయం ఆయన ఒపీనియన్ చెప్పాడు. నచ్చితే తీసుకో లేకపోతే లేదు. మంచి విషయం కఠినంగా చెప్తే అవతలి వాళ్ళు ఇబ్బంది పడతారు. మంచి విషయం మంచిగా చెప్తే నచ్చితే తీసుకుంటారు. దాని గురించి మాట్లాడక్కర్లేదు. ఎవరూ కావాలని తప్పు చేయరు చేయాలని అనుకోరు. చెప్పే విధానం మంచిగా చెప్తే ఎక్కువమందికి రీచ్ అవుతుంది అని అన్నారు.
Also Read : Koragajja : రీల్స్ చేయండి.. ఏకంగా కోటి రూపాయల వరకు బహుమతులు గెలుచుకోండి.. కన్నడ సినిమా క్రేజీ ఆఫర్..
దీంతో మారుతి.. శివాజీ మంచి చెప్పినా కాస్త కఠినంగా చెప్పాడు, నచ్చితే తీసుకో లేకపోతే వదిలేయ్ అనడంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
