Venkatesh Movie : జస్ట్ మిస్.. వెంకటేష్ సినిమాలో రియల్ గన్ ఫైర్ అయ్యేది.. ఆ రియల్ గన్ ఎవరిది అంటే..?

వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో జనవరి 14 న రాబోతున్నాడు

Director Anil Ravipudi Revealed interesting thing happened in Venkatesh Sankranthiki Vasthunam Movie Shoot

Venkatesh Movie : సినిమాల్లో కొన్ని యాక్షన్ సీన్స్ కు గన్స్ వాడతారని తెలిసిందే. అయితే సినిమాల కోసం ప్రత్యేకంగా తయారుచేసే టాయ్ గన్స్ ని వాడతారు. రియల్ గన్స్ లాగే కనిపించే డూప్లికేట్ గన్స్ ని సినిమాల్లో వాడతారు. అయితే తాజాగా ఓ నటుడు వెంకటేష్ సినిమాకు రియల్ గన్ తీసుకెళ్ళడట. ఇంకో నటుడు ఆ రియల్ గన్ ని తీసుకొచ్చి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇచ్చారట. అది రియల్ గన్ అని తెలియక అనిల్ రావిపూడి గన్ ఎక్కుపెట్టాడట. ఇంతకీ ఆ రియల్ గన్ ఎవరిది అంటే?

వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో జనవరి 14 న రాబోతున్నాడు. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, తమిళ్ కమెడియన్ వీటివి గణేష్ కూడా నటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో అనిల్ రావిపూడి షూటింగ్ సమయంలో నటుడు వీటివీ గణేష్ తో జరిగిన ఈ రియల్ గన్ ఇన్సిడెంట్ గురించి చెప్పారు.

Also Read : Sankranthiki Vasthunam : వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..?

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. షూటింగ్ స్పాట్ లో ఈయన గన్ ఏంటో తెలుసా అని అడిగారు. రియల్ గన్ తెలుసా అని అడిగారు. నరేష్ గారి దగ్గర రియల్ గన్ ఉంది అది మాకు తెలీదు. ఈయన ఆ గన్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అది చాలా చిన్నగా ఉంది. అది ఇటాలియన్ మాఫియా గన్. నేను మాములు గన్ అనుకోని గణేష్ వైపు గారి పాయింట్ చేసి పెట్టా. నరేష్ గారు అరుస్తూ వచ్చి గన్ లాక్కున్నారు. ఓపెన్ చేసి రియల్ బులెట్స్ చూపించారు. అది ఫెదర్ టచ్ అంట.. జస్ట్ మిస్ ఫైర్ అయ్యేది అని అన్నారు. దీంతో నటుడు నరేష్ దగ్గర లైసెన్స్‌డ్ గన్ ఉందని తెలిసింది.