Anil Ravipudi
Anil Ravipudi: నటన, డాన్స్, టైమింగ్ ఇలా అన్నిటిలో ది బెస్ట్ అంటారు జూనియర్ ఎన్టీఆర్ ను. అయితే ఇదంతా తెర మీద కనిపించే ఎన్టీఆర్. ఇవి కాకుండా ఫ్యామిలీతో సరదాగా గడపడం.. ఛాన్స్ దొరికితే కిచెన్ లో దూరి అద్భుతంగా వండి పెట్టడం కూడా తారక్ కు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాదు, సీనియర్లు జూనియర్లు అని తేడా లేకుండా తారక్ ఎక్కడ ఉంటే అక్కడ అందరినీ ఆటపట్టించడం.. ఏడిపించడం అంటే మహా పిచ్చి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో కూడా రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ చేసిన అల్లరిని రాజమౌళినే స్వయంగా చెప్పుకొని సరదాగా బాధపడిపోయారు.
Director Anil Ravipudi: ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు..!
కాగా, ఇప్పుడు మరో దర్శకుడు కూడా ఎన్టీఆర్ తనను రోజూ ర్యాగింగ్ చేసేవాడని చెప్పుకొచ్చాడు. పటాస్ సినిమాతో రచయిత నుండి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి ఇప్పటి వరకు ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాని విడుదలకి సిద్ధం చేస్తున్న అనిల్.. ఆ తర్వాత బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 3 ప్రమోషన్ లో బిజీగా ఉన్న అనిల్ ఓ ఇంటర్వ్యూలో తారక్ తనని రోజూ టీజ్ చేస్తూ ర్యాగింగ్ చేసేవాడని చెప్పుకొచ్చాడు.
Anil Ravipudi : బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌కి భలే చిక్కొచ్చి పడిందే.. ముగ్గురిలో ఎవరితో సినిమా?..
కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తరచూ సినిమా ఆఫీస్‌కి వెళ్లేవాడట. అక్కడ అనిల్ ను తెగ ర్యాగింగ్ చేసేవాడట. అయితే, ర్యాగింగ్ అంటే బాధ పెట్టడం కాదు అల్లరి చేస్తూ అనిల్ పై జోకులు వేస్తూ సరదాగా ఉండేవాడట. ఎన్టీఆర్ చేష్టలకి అక్కడ ఎప్పుడూ ఫన్ వాతావరణం ఉండగా.. తనకది ఎంతో మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటూ అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.