Director Apsar : శివుడి తత్త్వం, శివుడి విజువల్స్ అద్భుతంగా చూపించిన డైరెక్టర్ అప్సర్..

ఓ సరికొత్త కాన్సెప్ట్ తో థ్రిల్లర్ తో పాటు డివోషినల్ జానర్ కూడా జోడించి శివం భజే సినిమాని తెరకెక్కించారు.

Director Apsar gives Best Lord Shiva Visuals and Good Movie with Shivam Bhaje

Director Apsar : అశ్విన్ బాబు తాజాగా ఆగస్టు 1న శివం భజే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ సరికొత్త కాన్సెప్ట్ తో థ్రిల్లర్ తో పాటు డివోషినల్ జానర్ కూడా జోడించి శివం భజే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో మొదటి నుంచి చివరి వరకు శివుడు ఉంటాడు. శివ తత్వం గురించి, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే కాన్సెప్ట్ ని కథలో అంతర్లీనంగా చూపించారు. అలాగే కాలభైరవ స్వామిని కూడా చూపిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తైతే క్లైమాక్స్ లో వచ్చే శివుడి విజువల్స్, ఒక క్లైమాక్స్ షాట్ అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి.

అయితే ఇవన్నీ తీసింది ఒక ముస్లిం డైరెక్టర్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. శివం భజే సినిమాని అప్సర్ అనే డైరెక్టర్ తెరకెక్కించాడు. ఇతను ముస్లిం అయినా శివ తత్వాన్ని చాలా బాగా రాసుకొని కథలో ప్రతి సన్నివేశంలో శివుడి గురించి వచ్చేలా చూసుకొని చాలా బాగా తెరకెక్కించాడు. ఈ కథ, స్క్రీన్ ప్లే కూడా ఇతనే రాయడం గమనార్హం. అలాగే సాంకేతికంగా కూడా విజువల్స్ పరంగా ఈ సినిమాని అద్భుతంగా చూపించాడు దర్శకుడు అప్సర్.

Also Read : Allu Arjun – Dheeran : హీరోగా అల్లు అర్జున్ చిన్నప్పటి ఫ్రెండ్.. నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అంటూ బన్నీ స్పెషల్ ట్వీట్..

అప్సర్ గతంలో గంధర్వ అనే ఒక యూనిక్ కాన్సెప్ట్ తో సినిమాని తీసి మెప్పించాడు. ఇప్పుడు శివం భజే అనే డివోషనల్ థ్రిల్లర్ తో మరోసారి ప్రేక్షకులని మెప్పించాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. ఒక ముస్లిం డైరెక్టర్ శివుడి మీద సినిమా రాసుకొని, దాన్ని పర్ఫెక్ట్ గా తీయడంలో సక్సెస్ అవ్వడంతో డైరెక్టర్ అప్సర్ ని ప్రేక్షకులు అభినందిస్తున్నారు. ఇతను తీసిన రెండు సినిమాలు కొత్త కాన్సెప్ట్స్ తో వచ్చినవే. మరి నెక్స్ట్ ఎలాంటి కొత్త కాన్సెప్ట్ తో వస్తాడో చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు