Director Bobby comments on pawan kalyan and janasena in waltair veerayya movie pre release event
Director Bobby : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా రవితేజ ముఖ్య పాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత చిరంజీవి ఫుల్ మాస్ కామెడీ సినిమా చేస్తుండటంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. నేడు వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ జనసేన, పవన్ కళ్యాణ్ పై కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Pushpa 2 : సైలెంట్ గా మొదలుపెట్టేసిన పుష్ప 2 షూట్.. సుకుమార్ భార్య పోస్ట్ వైరల్..
బాబీ మాట్లాడుతూ.. మీరు పాలిటిక్స్ కి వెళ్ళాక నేను మీతో సినిమా చేయలేనేమో అని బాధపడ్డాను. రాజకీయాలు మీకు సూట్ అవ్వవు. అక్కడ మీ తమ్ముడు సమాధానం చెప్తాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసుకుంటారు. అయన రాజకీయాలు చేస్తారు. ఆయన నిలబెడతాడు. మీ బదులు ఆయన అన్నిటికి సమాధానం చెప్తారు. మీలో నుంచి వచ్చిన ఆవేశం, మంచితనం పవర్ స్టార్. మాటకి మాట, కత్తికి కత్తి, పదునుకి పదును ఆయన చూసుకుంటాడు సర్ అన్ని అని వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కూడా చర్చగా మారాయి.