Pushpa 2 : సైలెంట్ గా మొదలుపెట్టేసిన పుష్ప 2 షూట్.. సుకుమార్ భార్య పోస్ట్ వైరల్..

పుష్ప 2 సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ వెయిట్ చేస్తుండగా చిత్ర యూనిట్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా దర్శకుడు సుకుమార్ భార్య తబిత తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చారు...............

Pushpa 2 : సైలెంట్ గా మొదలుపెట్టేసిన పుష్ప 2 షూట్.. సుకుమార్ భార్య పోస్ట్ వైరల్..

Pushpa 2 shoot started sukumar wife post goes wiral

Pushpa 2 :  అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ లో కూడా రిలీజ్ అయి భారీ హిట్ కొట్టి 300 కోట్లకి పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

దీంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందుగా కథ వేరే అనుకున్న పుష్ప భారీ హిట్ అవ్వడంతో మళ్ళీ కథని పాన్ ఇండియా తగ్గట్టు మార్చారు. ఇక పుష్ప సినిమా రిలీజయి సంవత్సరం అవుతున్నా ఇంకా పుష్ప 2 అప్డేట్ ఇవ్వట్లేదు, షూటింగ్ మొదలవ్వలేదు అని బన్నీ అభిమానులు నిరాశ చెందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ ఫోటోషూట్ చేసినట్టు తెలిపారు.

Raghu Rama Krishna Raju : చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలి.. వైసీపీ ఎంపీ ట్వీట్..

పుష్ప 2 సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ వెయిట్ చేస్తుండగా చిత్ర యూనిట్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా దర్శకుడు సుకుమార్ భార్య తబిత తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చారు. పుష్ప 2 షూట్ నుంచి స్టిల్ అని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఓ ఫొటోని పోస్ట్ చేసి పుష్ప 2 సెట్స్ నుంచి పోస్ట్ చేస్తున్నాను అని పెట్టారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసి బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ త్వరగా చేసి సినిమాని త్వరగా రిలీజ్ చేయాలని కామెంట్స్ పెడుతున్నారు.