Director Bobby Wants To Make A Movie With Mahesh Babu
Director Bobby: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ అనే మాస్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కించిన బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఫార్ములాతో వచ్చిన ఈ మూవీకి మెగా ఫ్యాన్స్ పట్టం కట్టారు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో బాబీకి వరుస ఆఫర్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు బాబీ తన నెక్ట్స్ మూవీ ఏమిటనేది అనౌన్స్ చేయలేదు.
దీంతె బాబీ నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే బాబీకి మాత్రం ఓ స్టార్ హీరోతో ఎప్పటికైనా సినిమా చేయాలనేది కోరికగా ఉందని తెలియజేశాడు. ఇప్పటికే మహేష్ కోసం తన దగ్గర ఓ పవర్‌ఫుల్ స్టోరీలైన్ ఉందని బాబీ చెబుతున్నాడు. మహేష్ గనక తనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ సినిమా కథను తాను రెడీ చేస్తానని చెప్పుకొచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్. అయితే ప్రస్తుతం మహేష్ సినిమాల లైనప్ చూస్తుంటే, బాబీకి ఆయన ఛాన్స్ ఇస్తాడా లేడా అనేది సందేహంగా మారింది.
Director Bobby : ప్రేక్షకులు అలా మారిపోయారు.. వాళ్ళు మనకి రెండు గంటలు ఇవ్వడమే కష్టం..
ఇదిలా ఉంటే.. మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా మహేష్‌తో ఓ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు మరోసారి మహేష్‌తో సినిమా చేసి మహేష్‌కు ఓ సెన్సేషనల్ విజయాన్ని అందించాలని ప్రయత్నిస్తున్నాడు. మరి మహేష్ ఈ ఇద్దరు డైరెక్ట్స్‌లో ఎవరికి ఛాన్స్ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది.