Director Bobby : ప్రేక్షకులు అలా మారిపోయారు.. వాళ్ళు మనకి రెండు గంటలు ఇవ్వడమే కష్టం..

ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాబీ ఇప్పటి ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాబీ మాట్లాడుతూ.. మనం చెప్పే ఏ జోనర్ కథైనా ప్రేక్షకులకి ఎంటర్టైనింగ్ గా చెప్పాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులు మనకి....................

Director Bobby : ప్రేక్షకులు అలా మారిపోయారు.. వాళ్ళు మనకి రెండు గంటలు ఇవ్వడమే కష్టం..

Director Bobby comments on Audience in Waltair Veerayya Promotions

Director Bobby :  మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా రవితేజ ముఖ్య పాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత చిరంజీవి ఫుల్ మాస్ కామెడీ సినిమా చేస్తుండటంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. నేడు వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో గ్రాండ్ గా చేయనున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ బాబీ కూడా చిరంజీవికి ఫ్యాన్ అని తెలిసిందే. ఒక ఫ్యాన్ తమ హీరోతో సినిమాని తీస్తే ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని అందరూ భావిస్తారు. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ బాబీ తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

Director Bobby : లాక్ డౌన్ తర్వాత వాల్తేరు వీరయ్య కథ మారిపోయింది.. ముందు రాసుకున్న కథలో రవితేజ లేడు..

ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాబీ ఇప్పటి ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాబీ మాట్లాడుతూ.. మనం చెప్పే ఏ జోనర్ కథైనా ప్రేక్షకులకి ఎంటర్టైనింగ్ గా చెప్పాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులు మనకి రెండు గంటలు ఇవ్వడమే కష్టం అయిపోయింది. వాళ్ళు మనకి టైం ఇస్తే వరం ఇచ్చినట్టే. థియేటర్లకు వచ్చే వాళ్ళ సంఖ్య ఈ మధ్య బాగా తగ్గింది. ఓటీటీలో చూద్దాంలే అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటి టైంలో థియేటర్ కి వచ్చిన వాళ్ళని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తే చాలు, వాళ్ళు సినిమాకి కనెక్ట్ అవుతారు. ఏ జానర్ అయినా పర్లేదు. ప్రేక్షకులకి వాళ్ళిచ్చే రెండు గంటలకి న్యాయంగా గౌరవంగా వినోదం ఇవ్వాలి. ఇది వదిలేస్తే ప్రేక్షకులు మనల్ని వదిలేస్తారు అని అన్నారు.