Boyapati Srinu : పవన్ కళ్యాణ్‌పై డైరెక్టర్ బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?

మాస్ సినిమాలు తీయడంలో చేయి తిరిగిన డైరెక్టర్ బోయపాటి శ్రీను పవన్ కల్యాణ్‌పై ఆసక్తికరమైన కామెంట్లు చేసారు. ఇంతకీ ఆయన ఏమన్నారు?

Boyapati Srinu : పవన్ కళ్యాణ్‌పై డైరెక్టర్ బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?

Boyapati Srinu

Updated On : October 21, 2023 / 11:47 AM IST

Boyapati Srinu : స్టార్ హీరోలతో మాస్ ఎంటర్టైనర్‌లను తెరకెక్కించే బోయపాటి శ్రీను రీసెంట్‌గా పవన్ కల్యాణ్‌పై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ బోయపాటి ఏమన్నారు?

Thaman : అఖండ సినిమాలో థమన్ క్రెడిట్ ఏం లేదంటున్న బోయపాటి..

మాస్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన బోయపాటి శ్రీను రీసెంట్‌గా పవన్ కల్యాణ్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. పవన్ కల్యాణ్‌కి ఫిల్టర్ లేదని.. ఏది అనుకుంటే అది చేసేస్తారని వ్యాఖ్యానించారు. ఎక్కడ మంచి ఉంటే అక్కడ, ఎక్కడ నిజాయితీ, న్యాయం ఉంటే అక్కడ ఆయన నిలబడతారని పవన్‌కి హ్యాట్సాఫ్ అని అన్నారు బోయపాటి. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Boyapati Srinu : బాబోయ్ బోయపాటి లైనప్ చూశారా.. సూర్య, బన్నీ, మహేష్.. ఇన్ని సినిమాలా?

చానాళ్లుగా పవన్‌తో బోయపాటి సినిమా ఎందుకు లేదని చాలామందిలో మనసులో ఉన్న ప్రశ్న. దీనికి కూడా బోయపాటి సమాధానం చెప్పారు. తను హైజానర్‌లో సినిమా తీయాలని అనుకుంటానని అందువల్లే పవన్ ముందుకు రారని చెప్పారు బోయపాటి. పొలిటికల్‌గా పవన్ ఎంగేజ్ అయి ఉండటం వల్ల అన్ని రోజులు ఆయన ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చని.. ఒకవేళ ఇస్తే తప్పకుండా భవిష్యత్తులో పవన్‌తో సినిమా తీస్తానని స్పష్టం చేసారు బోయపాటి. బోయపాటి రీసెంట్ మూవీ ‘స్కంద’ భారీ ఎక్స్ పెక్టేషన్స్‌తో వచ్చినా యావవరేజ్ టాక్ సొంతం చేసుకుంది.