Harish Shankar : హిందూ ధర్మాన్ని విదేశీయులు గౌరవిస్తుంటే.. సొంత ప్రజలు విస్మరిస్తున్నారు.. మరోసారి హరీష్ శంకర్ సంచలన ట్వీట్

డైరెక్టర్ హరీష్ శంకర్ హిందూ ధర్మంపై మరోసారి సంచలన ట్వీట్ చేశారు. ఇటీవల హిందూ ధర్మంపై, ఆలయాలపై విమర్శలు చేయడం కొందరికి ఫ్యాషన్ అయిపోయిందంటూ ఫైరైన హరీష్ శంకర్ మరోసారి హిందూ ధర్మంపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Harish Shankar

Harish Shankar : డైరెక్టర్ హరీష్ శంకర్ హిందూ ధర్మంపై మరోసారి స్పందించారు. హిందూ ధర్మాన్ని విదేశీయులు గౌరవిస్తుంటే సొంత ప్రజలు విస్మరిస్తున్నారంటూ ఓ వీడియోను షేర్ చేశారు. హరీష్ శంకర్ ట్వీట్ వైరల్ అవుతోంది.

Harish Shankar : సనాతన ధర్మాన్ని విమర్శించడం, ఆలయాల మీద కామెంట్స్ చేయడం ఫ్యాషనైపోయింది.. హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు..

డైరెక్టర్ హరీష్ శంకర్ గత నెలలో సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సర్వం శక్తిమయం’ అనే సిరీస్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన హిందూ ధర్మం, ఆలయాలపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని విమర్శించడం, ఆలయాల మీద కామెంట్స్ చేయడం కొందరికి ఫ్యాషన్ అయిపోయిందంటూ ఫైర్ అయ్యారు. తాజాగా హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఓ వీడియోతో పాటు పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

హరీష్ శంకర్ పోస్ట్ చేసిన వీడియోలో ఓ విదేశీయుడు భగవంతునికి, భక్తునికి మధ్య బంధాన్ని చక్కగా వివరిస్తూ కనిపించాడు. భగవంతుడు అంటే కృష్ణుడు అని.. అతను అందగాడని.. ఆయన చిటికెన వేలితో గోవర్థన పర్వతాన్ని ఎత్తగలిగాడని చెబుతాడు. మనం అలా చేయలేమని మనం కేవలం భగవంతుడికి భక్తులమని అంటాడు. భారతీయుడిగా పుట్టి భగవంతుడిని ధ్యానించకపోతే జంతువుతో సమానమని ఆ విదేశీయుడు మొత్తం వీడియోలో భగవంతుడు, భక్తుడి గురించి చెప్పిన అంశాలు ఔరా అనిపించాయి.

Krishna : కృష్ణకి నివాళ్లు అర్పించిన వెంకయ్య నాయుడు.. మహేష్‌తో ఫోటోలు వైరల్..

హరీష్ శంకర్ ఈ వీడియోను షేర్ చేస్తూ ‘ విదేశీయులు హిందూ ధర్మాన్ని గౌరవిస్తుంటే .. సొంత ప్రజలు విస్మరిస్తున్నారని’ ట్యాగ్ తో పోస్టు చేశారు. హరీష్ శంకర్ పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది.