Krishna : కృష్ణకి నివాళ్లు అర్పించిన వెంకయ్య నాయుడు.. మహేష్‌తో ఫోటోలు వైరల్..

కృష్ణకి నివాళ్లు అర్పించిన వెంకయ్య నాయుడు, ఘట్టమనేని వారసులు.

Krishna : కృష్ణకి నివాళ్లు అర్పించిన వెంకయ్య నాయుడు.. మహేష్‌తో ఫోటోలు వైరల్..

Venkaiah Naidu Mahesh Babu Family members remembering Super Star Krishna

Updated On : November 15, 2023 / 8:03 PM IST

Krishna : సూపర్ స్టార్ కృష్ణ గత ఏడాది నవంబర్ 15న మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఘట్టమనేని కుటుంబంతో పాటు టాలీవుడ్ కూడా తీవ్ర శోకానికి గురయ్యింది. ఆయన అందరికి దూరమయ్యి నేటికీ సంవత్సరం కావొస్తుంది. దీంతో ఆయనను స్మరించుకుంటూ అభిమానులు, కుటుంబసభ్యులు, ప్రముఖులు నివాళ్లు అర్పిస్తున్నారు. ఇక ఘట్టమనేని కుటుంబం ఆయనను గుర్తు చేసుకుంటూ హైదరాబాద్ లో ఒక స్మారక దినం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఘట్టమనేని కుటుంబసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈక్రమంలోనే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరయ్యారు. కృష్ణకి నివాళ్లు అర్పించి ఆయనను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా పాల్గొన్నారు. కృష్ణకు ఆయన కూడా నివాళ్లు అర్పించారు. ఇక వీరితో మహేష్ బాబు, కృష్ణ తమ్ముడు మరియు నిర్మాత ఆదిశేషగిరిరావు ఉన్న ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also read : Dhootha : నాగచైతన్య మొదటి వెబ్ సిరీస్ రిలీజ్‌కి రెడీ.. ఏ ఓటీటీలో? ఎప్పుడు?

ఇక కృష్ణ వారసులు సోషల్ మీడియా వేదిక తమ నివాళులు తెలియజేస్తున్నారు. కృష్ణ కూతురు మంజుల.. “నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాము. నేను మీ ఇంటికి వచ్చాను. ఒకప్పుడు మేము వస్తే నువ్వు ఎంత బిజీలో ఉన్న మా కోసం వచ్చేవాడివి. సినిమాల్లో నువ్వు ఒక మ్యాజిక్ క్రియేట్ చేశావని ప్రపంచం మొత్తం చెబుతుంటుంది. కానీ వాళ్ళకి తెలియదు నువ్వు పర్సనల్ లైఫ్ లో కూడా అదే మ్యాజిక్ ని క్రియేట్ చేశావని. లవ్ యు నాన్న” అంటూ పేర్కొన్నారు.

సుధీర్ బాబు.. “మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి అమరం అద్భుతం” అంటూ గొప్పగా చెప్పుకొచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Sudheer Babu (@isudheerbabu)