Dhootha : నాగచైతన్య మొదటి వెబ్ సిరీస్ రిలీజ్‌కి రెడీ.. ఏ ఓటీటీలో? ఎప్పుడు?

అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కూడా ఒక వెబ్ సిరీస్ కి ఓకే చెప్పినట్లు తెలిసిందే. డైరెక్టర్ విక్రమ్ కే కుమార్(Vikram K Kumar) దర్శకత్వంలో నాగచైతన్య మెయిన్ లీడ్ గా ఈ సిరీస్ తెరకెక్కుతుంది.

Dhootha : నాగచైతన్య మొదటి వెబ్ సిరీస్ రిలీజ్‌కి రెడీ.. ఏ ఓటీటీలో? ఎప్పుడు?

Naga Chaitanya First Web Series Dhootha Releasing Date Announced

Dhootha : ఇటీవల స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. ఇదే బాటలో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కూడా ఒక వెబ్ సిరీస్ కి ఓకే చెప్పినట్లు తెలిసిందే. డైరెక్టర్ విక్రమ్ కే కుమార్(Vikram K Kumar) దర్శకత్వంలో నాగచైతన్య మెయిన్ లీడ్ గా ఈ సిరీస్ తెరకెక్కుతుంది. ఈ సిరీస్ టైటిల్ ‘దూత’ అని గతంలోనే ప్రకటించారు. దూత మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా ఉండబోతుంది. చైతూ మొదటిసారి ఈ జోనర్ లో చేస్తుండటంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి.

ఈ సిరీస్ మొదలైనప్పుడు 2022 మార్చ్ లో అనౌన్స్ చేసి మళ్ళీ ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మధ్యలో అసలు ఈ సిరీస్ ఉందా లేదా అని కూడా అనుకున్నారు. అయితే దూత టీం సైలెంట్ గా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తిచేసేసి డైరెక్ట్ రిలీజ్ కి రెడీ అయింది. దూత్ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime) ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు నేడు అధికారికంగా ప్రకటించారు.

Also Read : SSMB 29 : రాజమౌళి – మహేష్ బాబు సినిమా కూడా రెండు పార్టులుగా?

దీనికి సంబంధించి అమెజాన్ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా ఇందులో నాగ చైతన్య వర్షంలో గొడుగు పట్టుకొని సస్పెన్స్ గా చూస్తున్నారు. దీంతో ఈ పోస్టర్ కూడా వైరల్ గా మారింది. చైతు మొదటిసారి వెబ్ సిరీస్ లో నటించడంతో అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సిరీస్ పై ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలోనే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టి టీజర్, ట్రైలర్స్ విడుదల చేస్తారని సమాచారం. ఈ సిరీస్ లో ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయో తెలియాల్సి ఉంది. ఇక నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి జంటగా ఓ సినిమా చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by prime video IN (@primevideoin)