SSMB 29 : రాజమౌళి – మహేష్ బాబు సినిమా కూడా రెండు పార్టులుగా?

ఈసారి బాలీవుడ్ దాటి హాలీవుడ్ లెవల్ ని టార్గెట్ చేసిన రాజమౌళి మహేష్ సినిమా పనుల్ని స్టార్ట్ చేశారు.

SSMB 29 : రాజమౌళి – మహేష్ బాబు సినిమా కూడా రెండు పార్టులుగా?

Rajamouli Mahesh Babu SSMB 29 Movie will be planned in two parts Rumours goes Viral

Updated On : November 15, 2023 / 12:46 PM IST

SSMB 29 : RRR తర్వాత టైమ్ తీసుకుని చెయ్యబోతున్న మహేష్(Mahesh Babu) మూవీని గ్లోబల్ లెవల్ లో ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి(Rajamouli). ఇప్పటికే రాజమౌళి మేకింగ్, టేకింగ్ చూసిన వాళ్లు మహేష్ తో సినిమా అంటే మామూలుగా ఉండదు అని అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఇండియన్ హిస్టరీ లోనే రానటువంటి స్పై అడ్వెంచర్ యాక్షన్ డ్రామాని మహేష్ తో చెయ్యబోతున్నారు రాజమౌళి. ఈసారి బాలీవుడ్ దాటి హాలీవుడ్ లెవల్ ని టార్గెట్ చేసిన రాజమౌళి మహేష్ సినిమా పనుల్ని స్టార్ట్ చేశారు.

ఇప్పటికే స్పీడ్ గా జరుగుతున్న ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు స్క్రిప్టింగ్ కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసిన రాజమౌళి లేటెస్ట్ గా ఈ సినిమాని 2 పార్టులుగా తీస్తున్నారంటూ చర్చ జరుగుతోంది. నెక్ట్స్ ఇయర్ సెట్స్ మీదకెళ్లబోతున్న రాజమౌళి- మహేశ్ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కబోతోందని టాలీవుడ్ టాక్. 500 కోట్ల బడ్జెట్ కి పైగా స్టోరీని ల్యాగ్ చెయ్యకుండా స్క్రీన్ ప్లేతోనే రెండు పార్టులుగా సినిమాని చూపించాలని ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే ఈ 2 పార్టుల ట్రెండ్ తెలుగులో, బయట పరిశ్రమల్లో విపరీతంగా పాపులర్ అయ్యింది. ప్రజెంట్ తెలుగు స్టార్ హీరోలందరూ 2 పార్టులుగానే సినిమాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Varun Lavanya : మరోసారి వరుణ్ లావణ్య రిసెప్షన్.. ఎయిర్ పోర్ట్‌లో కొత్త జంట.. ఈసారి ఎక్కడో తెలుసా?

గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే రేంజ్ లో భారీ సినిమాగా తెరకెక్కబోతోంది రాజమౌళి-మహేశ్ మూవీ. ఇండియానా జోన్స్, రాబిన్ హుడ్ రేంజ్ అడ్వెంచర్ స్టైల్లో మహేష్ బాబుతో సినిమా చేస్తున్నానని ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు రాజమౌళి . దీనికి తోడు ఇప్పుడు సినిమా 2 పార్టులు అంటే .. ఏ రేంజ్ లో గ్రాండియర్ ఉండబోతోందో..? ఏ రేంజ్ లో మేకింగ్ ఉండబోతోందో అని ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారు అభిమానులు.