Varun Lavanya : మరోసారి వరుణ్ లావణ్య రిసెప్షన్.. ఎయిర్ పోర్ట్‌లో కొత్త జంట.. ఈసారి ఎక్కడో తెలుసా?

హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య వరుణ్ లావణ్య రిసెప్షన్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఇక పెళ్లి దగ్గర్నుంచి లావణ్య ఇక్కడే అత్తారింట్లోనే ఉంటుంది. పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య ఫొటోలు వస్తే వైరల్ గా మారుతున్నాయి.

Varun Lavanya : మరోసారి వరుణ్ లావణ్య రిసెప్షన్.. ఎయిర్ పోర్ట్‌లో కొత్త జంట.. ఈసారి ఎక్కడో తెలుసా?

Varun Tej Lavanya Tripathi Planning Once Again Wedding Reception

Updated On : November 15, 2023 / 12:23 PM IST

Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇటీవల ఘనంగా ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, చిరంజీవి సన్నిహితులు, లావణ్య ఫ్యామిలీ, అతి కొద్దీ మంది సన్నిహితుల మధ్యే ఈ వివాహం జరిగింది. ఇక ఇటలీ వివాహం తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు నాగబాబు.

హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య వరుణ్ లావణ్య రిసెప్షన్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఇక పెళ్లి దగ్గర్నుంచి లావణ్య ఇక్కడే అత్తారింట్లోనే ఉంటుంది. పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య ఫొటోలు వస్తే వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే వీరి పెళ్లి తర్వాత వచ్చిన మొదటి దీపావళి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లికి ముందు కూడా రెండు ప్రీ వెడ్డింగ్ పార్టీలు, నిశ్చితార్థం వేడుకలు, బ్యాచిలర్స్ పార్టీలు.. ఇలా చాలానే ఈవెంట్స్ చేసుకున్నారు ఈ జంట.

ఇప్పుడు మరోసారి రిసెప్షన్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు వరుణ్ లావణ్య. అయితే ఈ సారి లావణ్య త్రిపాఠి ఇంటి వద్ద వాళ్ళ బంధువుల మధ్య రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. లావణ్య త్రిపాఠిది అయోధ్య దగ్గర ఒక ఊరు అయినా ప్రస్తుతం వీరి ఫ్యామిలీ డెహ్రాడూన్(Dehradun) లో ఉంటున్నట్టు తెలుస్తుంది. అందుకే వరుణ్ లావణ్య రిసెప్షన్ డెహ్రాడూన్ లో మరోసారి జరగనున్నట్టు సమాచారం. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుణ్, లావణ్య, నిహారిక డెహ్రాడూన్ కి వెళ్తూ కెమెరాలకు చిక్కారు.

Also Read : Hansika Motwani : దుర్గమ్మ దర్శనానికి.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై హన్సిక..

దీంతో మరోసారి ఈ జంట రిసెప్షన్ చేసుకోబోతున్నట్టు సమాచారం. మళ్ళీ వీరి ఫోటోల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీలో కూడా కొద్దిమంది ఈ ఈవెంట్ కి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి వరుణ లావణ్య తమ పెళ్లి వేడుకని గ్రాండ్ గా ఇంకా చేసుకుంటూనే ఉన్నారు.