Harish Shankar : సనాతన ధర్మాన్ని విమర్శించడం, ఆలయాల మీద కామెంట్స్ చేయడం ఫ్యాషనైపోయింది.. హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు..
సర్వం శక్తిమయం సిరీస్ ప్రెస్ మీట్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా వచ్చారు. ఈ సిరీస్ హిందూ ధర్మం గురించి గొప్పగా చెప్తుంది. ఇలాంటివి ఇంకా రావాలి అని చెప్తూ హిందూ ధర్మం, ఇటీవల పలువురు చేస్తున్న కామెంట్స్ పై వ్యాఖ్యలు చేశారు.

Harish Shankar fire for criticizing Hinduism and temples
Harish Shankar : ఇటీవల పలువురు హిందూ సనాతన ధర్మంపై, ఆలయాలపై(Temples) ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది సెక్యులర్స్ అని చెప్పుకుంటూ పలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఇలాంటి వాటిపై తీవ్రంగా స్పందించారు. ఆహా ఓటీటీలో(Aha OTT) సర్వం శక్తిమయం అనే సిరీస్ వచ్చింది. అమ్మవారి అష్టాదశ పీఠాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి, హిందూ ధర్మం గొప్పతనం గురించి చెప్తూ తీసిన సిరీస్. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు.
ఈ సర్వం శక్తిమయం ప్రెస్ మీట్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా వచ్చారు. ఈ సిరీస్ మొదలై బయటకు వచ్చిన తీరుని చెప్తూ భగవత్ సంకల్పం వల్లే ఇలాంటి సిరీస్, ఈ సమయంలో వచ్చింది అని తెలిపారు. అలాగే ఈ సిరీస్ హిందూ ధర్మం గురించి గొప్పగా చెప్తుంది. ఇలాంటివి ఇంకా రావాలి అని చెప్తూ హిందూ ధర్మం, ఇటీవల పలువురు చేస్తున్న కామెంట్స్ పై వ్యాఖ్యలు చేశారు.
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. హిందూ మతం వేరు, హిందూ ధర్మం వేరు. భారతదేశం హిందూమతంతో ఉన్నా హిందూ ధర్మంపైనే నిలబడింది. హిందూ మతం బొట్టు పెట్టండి అని చెప్తుంది. హిందూ ధర్మం పక్కోడికి అన్నం పెట్టండి అని చెప్తుంది. ఆ పక్కోడికి బొట్టు ఉందా లేదా అని కూడా చూడదు. కొన్ని వందల సంవత్సరాలుగా వేరే మతాలు మన దేశంలో ఇంతలా పెరిగాయి అంటే అది హిందూ ధర్మంలో ఉన్న పరమత సహనమే. మీరు ఎవర్నైనా పూజించండి, చివరికి అందరూ ఒకేచోటికి వెళ్తారు అని హిందూ ధర్మం నమ్ముతుంది అన్నారు.
అలాగే.. కొంతమంది నేను దేవుడ్ని నమ్మను, కానీ ఏదో ఒక ఎనర్జీ ఉందని నమ్ముతాను అంటారు. ఎనర్జీకి రూపం ఉండదు, దేవుడికి అంతే. కనపడకపోయినా ఎనర్జీని నమ్ముతున్నావు అంటే ఉన్నట్టే. దేవుడు కూడా కనపడకపోయినా ఉన్నట్టే అని తెలిపారు. ఇక ఇటీవల పలువురు హిందూ ఆలయాలపై, ధర్మంపై చేస్తున్న కామెంట్స్ కి స్పందిస్తూ.. ఇటీవల సనాతన ధర్మాన్ని విమర్శించడం, ఆలయాల మీద కామెంట్స్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. ధర్మాన్ని నమ్మేవాళ్లే గుడికి రావాలి. గుడి రిలీజియస్ ప్లేస్, సెక్యులర్ ప్లేస్ కాదు. హాస్పిటల్, స్కూల్ లాగా ఎవరు పడితే వాళ్ళు వచ్చేది కాదు, ధర్మాన్ని నమ్మేవాళ్లే గుడికి రావాలి. కొంతమంది సెక్యులర్ ముసుగు వేసుకొని ఇవేమి తెలియకుండా నోటికొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు.
Also Read : Karthika Nair : సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్.. వరుడు ఎవరో?
దీంతో హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా, చర్చగా మారాయి. పలువురు నిజం చెప్పారు, చాలా చక్కగా వివరించారు అని అభినందిస్తూ కామెంట్స్ చేస్తుండగా కొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు.
The Temple is a religious place not a secular place
~ Chad @harish2you pic.twitter.com/DL41xOHDTB— SP (@Just__SP) October 20, 2023