×
Ad

Harish- Anil: తమ్ముడు అనీల్.. కారులో తొందరగా రా.. పవన్ పాటను గిఫ్టుగా ఇచ్చేస్తా!

అనిల్ రావిపూడికి స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్(Harish- Anil).

Director Harish Shankar special gift to anil ravipudi

  • అనిల్ కి మెగాస్టార్ కారు గిఫ్ట్
  • ఆ కారేసుకొని వస్తే పవన్ పాట వినిపిస్తా అన్న హరీష్ శంకర్
  • హరీష్ పోస్ట్ వైరల్

Harish- Anil: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఏకంగా రూ.330 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా దర్శకుడు అనిల్ రావిపూడి(Harish- Anil) పేరు మారుమ్రోగిపోతుంది.

అయితే, మన శంకర వరప్రసాద్ గారు సినిమా భారీ విజయం సాధించిన నేపధ్యంలో అనిల్ రావిపూడి కి మెగాస్టార్ చిరంజీవి లగ్జరీ ‘రేంజ్ రోవర్’ కారును గిఫ్టుగా ఇచ్చిన విషయం తెలిసిందే. దానికి సంబందించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు, అదేరోజు జరిగిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ ఈవెంట్ కి కూడా అనిల్ రావిపూడి అదే కారులో రావడం విశేషం.

Animal Park: ‘యానిమల్ పార్క్’ క్రేజీ న్యూస్.. సందీప్ ఆల్రెడీ కంప్లీట్ చేశాడట.. ఈసారి ఒక్కడు కాదు!

ఇక ఆ ఈవెంట్ అనంతరం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అనిల్. ‘మెగా బహుమతి.. మహదానందం.. మనోధైర్యం.. ధనా ధన్’ అంటూ తన స్టయిల్లో రాసుకొచ్చాడు. ఆలాగే తాను ఈ క్షణాన్ని ఎప్పటికి మర్చిపోలేను అంటూ చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పాడు అనిల్. అయితే, అనిల్ చేసిన ఈ పోస్ట్ కి మరో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యాడు. సోషల్ మీడియాలో అనిల్ చేసిన పోస్ట్ కి రిప్లై ఇస్తూ.

“తమ్ముడు అనిల్.. త్వరగా ఆ కారేసుకొని నా దగ్గరకు వస్తే.. అందులోనే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త వింటూ అలా డ్రైవ్ వేద్దాం.. ఇదే నాకు నా గిఫ్ట్” అంటూ రాసుకొచ్చాడు హరీష్ శంకర్. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇక హరీష్ చేసిన ఈ పోస్ట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. నెక్స్ట్ సాంగ్ విడుదల కాబోతుంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.