Animal Park: ‘యానిమల్ పార్క్’ క్రేజీ న్యూస్.. సందీప్ ఆల్రెడీ కంప్లీట్ చేశాడట.. ఈసారి ఒక్కడు కాదు!

సందీప్ రెడ్డి వంగా యానిమల్ పార్క్(Animal Park) సినిమా గురించి ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది.

Animal Park: ‘యానిమల్ పార్క్’ క్రేజీ న్యూస్.. సందీప్ ఆల్రెడీ కంప్లీట్ చేశాడట.. ఈసారి ఒక్కడు కాదు!

Sandeep reddy vanga Animal Park movie crazy update.

Updated On : January 27, 2026 / 7:21 AM IST
  • సందీప్ రెడ్డి యానిమల్ పార్క్
  • ఇప్పటికే 20 శాతం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్
  • 2027లో షూటింగ్ మొదలు

Animal Park: యానిమల్.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో క్రియేట్ చేసిన సెన్సేషన్ ఈ సినిమా. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఫాథర్ అండ్ సన్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

మోస్ట్ వైలెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఆ సినిమాకు యానిమల్ పార్క్(Animal Park) అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలోనే తాజాగా యానిమల్ పార్క్ సినిమా గురించి ఆసక్తికర న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది. అదేంటంటే,, యానిమల్ పార్క్ సినిమాకు సంబందించిన 20 శాతం స్క్రిప్ట్ వర్క్ ను సందీప్ రెడ్డి వంగా ఆల్రెడీ కంప్లీట్ చేశేశాడట.

Malavika Mohanan: కొంటె చూపులతో మంటపుట్టిస్తున్న మాళవిక.. క్యూట్ ఫొటోలు

అంతేకాదు, తన రైటింగ్ టీం పూర్తి కథను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట. యానిమల్ సినిమాలో కేవలం హీరో రణబీర్ కపూర్ మాత్రమే యానిమల్ తరహా బిహేవియర్ తో కనిపిస్తాడు. కానీ, యానిమల్ పార్క్ సినిమాలో ఆ తరహా పాత్రలు చాలానే ఉంటాయట. అందుకే, ఆ సినిమాకు యానిమల్ పార్క్ అని టైటిల్ పెట్టాడట సందీప్ రెడ్డి వంగ. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ చెప్పడం విశేషం.

అందుకే, యానిమల్ సినిమాలో చూపించిన వైలెన్స్ కంటే చాలా రేట్లు ఎక్కువ వైలెన్స్ ఈ సినిమాలో ఉండనుందట. సందీప్ ఈ కామెంట్స్ చేసినప్పటినుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక సందీప్ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే యానిమల్ పార్క్ సినిమాను మొదలుపెడతాడట సందీప్. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.