Director Harish Shankar to recreate Gabbar Singh scene in Ustaad Bhagat Singh movie
Ustaad Bhagat Sing: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ అనగానే టక్కున గుర్తొచ్చే సినిమా గబ్బర్ సింగ్. 2012లో వచ్చిన ఈ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక ఫ్యాన్ తన ఫెవరేట్ హీరోతో సినిమా చేస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కి రుచి చూపించిన సినిమా గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ ని ఎలా చూపిస్తే ఆయన ఫ్యాన్స్ ఇష్టపడతారో అలా మీటర్ లో సెట్ చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, పర్ఫార్మెన్స్, యాక్షన్, కామెడీ, ఎమోషన్ ఇలా ప్రతీ యాస్పెక్ట్ లో పీక్స్ ని చూపించి దుమ్ముదులిపేశాడు. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
Akhanda 2: ఇదేం ఫ్యానిజం రా బాబు.. ఒక టికెట్ లక్ష పెట్టి కొన్నాడు.. బాలయ్య క్రేజ్ మాములుగా లేదుగా..
ప్రతీ సీన్, ప్రతీ డైలాగ్ ఎక్స్ట్రీమ్ లో ప్రెజెంట్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు హరీష్. ఇప్పుడు, దాదాపు 16 ఏళ్ళ తరువాత ఈ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. అదే ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Sing). ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, టీజర్స్ కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ అప్లాజ్ వచ్చింది. దీంతో ఈ సినిమా విడుదల కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా వచ్చిన సమాచారం మేరకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2026 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడట దర్శకుడు హరీష్ శంకర్. ఇందులో భాగంగానే, గబ్బర్ సింగ్ మ్యాజిక్ ను మరోసారి రిపీట్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. అందుకే, ఆ సినిమాలోని అంత్యాక్షరి సీన్ ను ఉస్తాద్ భగత్ సింగ్ లో రీ క్రియేట్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. గబ్బర్ సింగ్ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే అంత్యాక్షరి సీన్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సీన్ కి థియేటర్స్ మొత్తం ఊగిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అదే సీన్ ని ఉస్తాద్ భగత్ సింగ్ లో రీ క్రియేట్ చేయనున్నాడట. దీనికి సంబందించిన షూట్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయ్యిందట. ఈ సీన్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేయనుంది అంటూ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న టాక్. మరి ఈ సీన్ లో మ్యాజిక్ రిపీట్ అయ్యింది అంటే మరోసారి థియేటర్స్ బ్లాస్ట్ అవడం ఖాయం అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.