Director Jayashankar made interesting comments about Ari movie.
Director Jayashankar: టాలీవుడ్ క్రేజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ అనేది’ ఉపశీర్షిక. దర్శకుడు జయశంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో వినోద్ వర్మ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి(Director Jayashankar) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు జయశంకర్ ‘అరి’ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Niharika: ‘కమిటీ కుర్రోళ్లు’ కాంబో రిపీట్… దర్శకుడు యదు వంశీతో నిహారిక మరో మూవీ
సినిమా మీద ప్యాషన్ తో ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాను. 2018లో పేపర్ బాయ్ మూవీతో దర్శకుడయ్యాను. ఆ సినిమా తర్వాత పెద్ద సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ, కోవిడ్ వల్ల ఆ ప్రాజెక్ట్స్ మొటీరియలైజ్ అవ్వలేదు. 2021లో ‘అరి’ మూవీ వర్క్ స్టార్ట్ చేశాను. చిన్నప్పటి నుంచి నాకు పురాణాలు, ఇతిహాసాలు అంటే ఆసక్తి. వాటిలో అరిషడ్వర్గాలను జయించాలి అని చెప్పారు కానీ, ఎలా జయించాలో చెప్పలేదు. అలా, 2016లో ఈ స్టోరీ ఐడియా స్ట్రైక్ అయ్యింది. అప్పుడు హిమాలయాలకు వెళ్లి కొందరు యోగులను కలిసి అనేక విషయాలు తెలుసుకున్నా. వాటి ఆధారంగానే ‘అరి’ సినిమా చేశాను. ఇలాంటి కథల్ని పూర్తి సందేశాత్మకంగా కాకుండా ఎంటర్ టైనింగ్ గా చెప్పాలి.
‘అరి’ సినిమాని స్టార్స్ తో కూడా చేయొచ్చు. కానీ, అప్పుడు కథ కంటే స్టార్ డమ్ డామినేట్ చేస్తుంది. అందుకే, వీరితో చేశాను. వారి పర్ ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తుంది. అలాగే సినిమాలో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ విజువల్స్ అందించాం. అరిషడ్వర్గాలు అనే సబ్జెక్ట్ సాధారణ ప్రేక్షకులకు కూడా సులువుగా అర్థమయ్యేలా అరి సినిమా ఉంటుంది. సెన్సార్ వాళ్లు సైతం సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. అలాగే విడుదల తరువాత కూడా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని అనుకుంటున్నా. వెంకయ్య నాయుడు, మల్లాది, యండమూరి లాంటి వాళ్లు మా సినిమాను చూసి అభినందించారు.
వెంకయ్య నాయుడు గారు ‘అరి’ సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉంది అన్నారు. అది గొప్ప ప్రశంసగా అనిపించింది. అశ్వనీదత్ గారు, హిందీలో ఒక పెద్ద హీరో, కన్నడలో ఒక స్టార్ చూశారు. వారికి బాగా నచ్చింది. ‘అరి’ లాంటి మూవీ చేయాలంటే నిర్మాతలకు అభిరుచితో పాటు ధైర్యం ఉండాలి. అలాంటి ప్రొడ్యూసర్స్ నాకు దొరకడం సంతోషంగా ఉంది. ఇది రెగ్యులర్ మూవీ కాదు. రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు. సినిమా ప్రీ క్లైమాక్స్ వరకు నెక్ట్స్ ఎం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఉంటుంది. క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ సినిమా తరువాత బాలీవుడ్ యాక్టర్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో ఓ సినిమా చేయబోతున్నా. డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. అంటూ చెప్పుకొచ్చాడు.