Niharika: ‘కమిటీ కుర్రోళ్లు’ కాంబో రిపీట్… దర్శకుడు యదు వంశీతో నిహారిక మరో మూవీ
కమిటీ కుర్రోళ్లు.. గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై భారీ భారీ (Niharika)విజయాన్ని సాధించింది. మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు యదు వంశీ తెరకెక్కించాడు.

Niharika is doing another film with Committee kurrollu director Yaadhu Vamsi.
Niharika: కమిటీ కుర్రోళ్లు.. గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై భారీ భారీ విజయాన్ని సాధించింది. మెగా(Niharika) డాటర్ నిహారిక నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు యదు వంశీ తెరకెక్కించాడు. విలేజ్ బ్యాక్డ్రాప్ లో పొలిటికల్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాతో మొత్తం 11 మంది కొత్త నటీనటుకు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.24.5 కోట్ల వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
SSMB29: మహేష్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. మరో ‘నాటు నాటు’ సాంగ్ సిద్ధం.. కానీ ఈసారి..
ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరోసారి ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందించేలా ఈ కథను సిద్ధం చేశాడట దర్శకుడు యదు వంశీ. 2026 మొదట్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా ఇయర్ ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక నిర్మాణంలో వస్తున్న సినిమాల విషయానికి వస్తే, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2 కొత్త సినిమా తెరకెక్కుతోంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫ్యాంటసీ, కామెడీ జోనర్ లో వస్తున్న ఈ సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.