SSMB29: మహేష్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. మరో ‘నాటు నాటు’ సాంగ్ సిద్ధం.. కానీ ఈసారి..
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి (SSMB29)కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత పాన్ వరల్డ్ రేంజ్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

Rajamouli planning folk song with Mahesh Babu-Priyanka Chopra in SSMB 29
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత పాన్ వరల్డ్ రేంజ్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇంటర్నేషనల్ లెవల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమా కోసం ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయనున్నాడట. అందుకే, (SSMB29)ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.
War 2 OTT: ఓటీటీలోకి వార్ 2.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు అనే పాట ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటకు ప్రపంచం మొత్తం డాన్స్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాట ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించి ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచపటంలో నిలబెట్టింది. ఇప్పుడు అలాంటి మరో మాస్ సాంగ్ ని మహేష్ కోసం సెట్ చేశాడట రాజమౌళి. పక్కా మాస్ అండ్ ఫోక్ టైప్ లో ఈ పాటను కంపోజ్ చేశాడట కీరవాణి. ఇక ఈ పాటకు సంబంధించి కాన్సెప్ట్ డిజైనింగ్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే మహేష్ బాబు-ప్రియాంక చోప్రా మధ్య ఈ పాటను షూట్ చేయనున్నాడట రాజమౌళి.
నాటు నాటు.. పాటకు అద్భుతమైన డాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు కొరియోగ్రాఫి అందించనున్నాడట. త్వరలోనే ఈ సాంగ్ షూట్ మొదలుకానుందని టాక్. ఇది గనక వర్కౌట్ అయితే మరో నాటు నాటు లాంటి మాస్ బీట్ సెట్ అవడం ఖాయం. ఇక మహేష్-రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ క్రేజీ సినిమాకి పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇక తాజాగా ఈ లిస్టులోకి మరో టైటిల్ చేసింది. అదే ‘వారణాసి’. ఇప్పటికే ఈ మూవీ టీం విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ బాబు మేడలో త్రిశూలం,ఢమరుఖం,లింగం,నందీశ్వరుడు కలిపినా లాకెట్ ఉంది. కాబట్టి, ఈ సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అర్థమవుతోంది. ఆ ఎలిమెంట్స్ ను మ్యాచ్ చేస్తూ ‘వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. కానీ, వారణాసి అనేది ఇండియా వరకు ఒకే కానీ, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఎలా రిప్రెజెంట్ చేస్తారు అనేది చూడాలి.