Jyothi Krishna : పవన్ కళ్యాణ్ మెట్లు కడిగి అలిసిపోయి 2 గంటలు లేట్ గా వచ్చారు.. అయినా.. ఇది కదా పవన్ డెడికేషన్ అంటే..

ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ జ్యోతికృష్ణ మాట్లాడుతూ..

Director Jyothi Krishna Interesting Comments on Pawan Kalyan at HariHara VeeraMallu Press Meet

Jyothi Krishna : పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు జూన్ 12న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, మూడు సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు ఈ సినిమా మొదటి ప్రెస్ మీట్ ని నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ ఉంటే ఉదయం 8 గంటలకే వచ్చేస్తారు. ఒక రోజు మాత్రం 9.30 అయిపొయింది అయినా రాలేదు. షూట్ లో నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. 10 గంటలకు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. రాగానే కారవాన్ లోకి వెళ్లి షాట్ రెడీ సర్ అంటే రెండు నిమిషాల్లో వచ్చేసారు. ఆ తర్వాత నాకు తెలిసింది. ఆ రోజు విజయవాడ కనకదుర్గ టెంపుల్ లో దాదాపు 400 మెట్లు కడిగి, వాటికి బొట్లు పెట్టి అలసిపోయి వచ్చారు. అయినా నేను రమ్మన్నాను అని వెంటనే వచ్చేసారు. మా నాన్నకు తెలిసి కాసేపు రెస్ట్ తీసుకోనివ్వాలి కదా అని తిట్టారు. పవన్ కళ్యాణ్ గారు అంత కష్టపడతారు అని తెలిపారు.

Also Read : AM Ratnam : పవన్ తో రీమేక్ ప్లాన్ చేశాం.. సత్యాగ్రహి ఆగిపోయింది.. ఈ సినిమా చాలా లేట్.. ఖుషి హిందీలో డబ్బింగ్ చేయమన్నారు.. ఎమోషనల్ అయిన నిర్మాత..

దీంతో ఓ పక్క పొలిటికల్, మరో పక్క సినిమాలు.. అన్ని చూసుకుంటూ అంత కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్, ఇది కదా పవన్ కళ్యాణ్ డెడికేషన్ అంటే అని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.