AM Ratnam : పవన్ తో రీమేక్ ప్లాన్ చేశాం.. సత్యాగ్రహి ఆగిపోయింది.. ఈ సినిమా చాలా లేట్.. ఖుషి హిందీలో డబ్బింగ్.. ఎమోషనల్ అయిన నిర్మాత..
ప్రెస్ మీట్ లో నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుబంధం చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

Producer AM Rathnam Emotional Speech in Pawan Kalyan HariHara VeeraMallu Press meet
AM Rathnam : పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు జూన్ 12న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. మొదటి సారి పవన్ పీరియాడిక్ సినిమా చేయడం, పాన్ ఇండియా సినిమా కావడం, పవన్ సినిమా వచ్చి రెండేళ్లు కావడం, డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ మొదటి సినిమా కావడంతో హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, మూడు సాంగ్స్ రిలీజ్ చేసారు. నేడు ఈ సినిమా మొదటి ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుబంధం చెప్తూ ఎమోషనల్ అయ్యారు.
Also Read : Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరుగుతుంటే.. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో తెలుసా?
ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. రిలీజ్ కి తక్కువ టైం ఉంది. ప్రమోషన్స్ కి సమయం సరిపోదు. ఇంకో రెండు పెద్ద ఈవెంట్స్ చేస్తాం. నాకు మెసేజ్ సినిమాలు చేయాలని ఉంటుంది. అందుకే భారతీయుడు, ఒకేఒక్కడు, నాయక్ సినిమాలు చేశాను. ఇప్పుడు హరిహర వీరమల్లు చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారితో ఖుషి, బంగారం సినిమా చేసాము. ఇది మూడో సినిమా. గతంలో పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో సత్యాగ్రహి అనౌన్స్ చేసాము. పూజ చేసి ఓపెనింగ్ కూడా చేసాము. దానికి ఆయనే దర్శకుడు. సత్యాగ్రహి అంటే సత్య ఆగ్రహి. న్యాయం కోసం చనిపోవడానికి రెడీ అని అర్ధం. అది అనుకోకుండా ఆగిపోయింది. పవన్ గారితో తమిళ్ వేదాళం సినిమా రీమేక్ చేద్దామనుకున్నాం. ఎన్నికలు వచ్చి అది ఆగిపోయింది. వేదాళం సినిమాని మా అబ్బాయినే డైరెక్ట్ చేయమన్నారు పవన్ గారు. గతంలో ఖుషి సినిమాని హిందీలో డబ్బింగ్ చేయమని పవన్ కళ్యాణ్ గారు అడిగారు. అప్పుడు కుదరలేదు. ఈ సబ్జెక్టు మాత్రం పాన్ ఇండియా. అందుకే ఇది హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. నార్త్ లో బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.
Also See : Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ సాంగ్ రిలీజ్.. పవన్ కళ్యాణ్ HD స్టిల్స్..