Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరుగుతుంటే.. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో తెలుసా?
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు అని ఆసక్తి నెలకొంది.

Where is Pawan Kalyan while HariHara VeeraMallu Song Releasing Press Meet Happened in Hyderabad
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 న రిలీజ్ అవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా నేడు హరిహర వీరమల్లు సినిమా మొదటి ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ సాధారణంగా సినిమా ప్రమోషన్స్ కి రారు. నేడు నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ కి కూడా పవన్ కళ్యాణ్ హాజరవలేదు. హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ కి హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం, మిగిలిన మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు అని ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ నేడు కర్ణాటక విధాన సౌధ ప్రాంగణంలో జరగనున్న కుంకి ఏనుగుల అప్పగింత కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగుళూరు వెళ్లారు. అక్కడ కర్ణాటక అధికారులతో పవన్ బిజీగా ఉన్నారు.
Also See : Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ సాంగ్ రిలీజ్.. పవన్ కళ్యాణ్ HD స్టిల్స్..
ఏపీలో మానవులు – ఏనుగుల మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించేందుకు కర్ణాటక ప్రభుత్వంతో అటవీశాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ మాట్లాడి 5 కుంకీ ఏనుగులను ఏపీకి రప్పిస్తున్నారు. దాంతో నేడు కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆ ఏనుగులను అప్పగించే కార్యక్రమంలో ఏపీ అటవీ శాఖ మంత్రిగా పవన్ పాల్గొంటున్నారు.