Karthikeya : జగపతిబాబుతో హిట్ కొట్టిన డైరెక్టర్.. చిన్న సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ..

ఒకప్పుడు దర్శకుడిగా హిట్ కొట్టిన డైరెక్టర్ కార్తికేయ కొమ్మి నేడు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (Karthikeya)

  • Published on- May 13, 2026 / 02:42 PM IST

Karthikeya

Karthikeya : సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని అనేది ట్యాగ్ లైన్. వారాహ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై జయశంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ నిర్మాణంలో కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దూరదర్శిని సినిమా మే 15న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఒకప్పుడు దర్శకుడిగా హిట్ కొట్టిన డైరెక్టర్ కార్తికేయ కొమ్మి నేడు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

డైరెక్టర్ తన గురించి చెప్తూ.. ఇంతకు ముందు నేను జగపతి బాబుతో సాధ్యం సినిమా, నవదీప్ తో వసూల్‌ రాజా, మంచు లక్ష్మితో లక్ష్మీబాంబ్‌ సినిమాలకు దర్శకత్వం చేశాను. కానీ మధ్యలో కొంత గ్యాప్ అనుకోకుండా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్తవాళ్లతో వస్తున్నాను అని తెలిపారు.

Also Read : Vijay Trisha : సీఎం అవ్వగానే.. త్రిషకు ఫేవర్ చేసిన విజయ్.. పర్మిషన్ గ్రాంటెడ్..

ఈ సినిమా గురించి చెప్తూ.. ఓ యదార్థ సంఘటనతో చాలా రియలిస్టిక్‌గా ఈ సినిమాను తీసాము. పేరెంట్స్‌ చాయిస్‌, సొసైటీ చాయిస్‌, పిల్లల చాయిస్‌.. వీటి మధ్య ఉండే క్లాష్‌ ఈ సినిమా కథాంశం. చిత్రలహరి టైమ్‌ పిరియడ్‌ మిస్‌ అయిన వారికి, ఆ టైమ్‌లో చిత్రలహరి అనుభూతిని పొందిన వారికి ఈ సినిమా పూర్తి సంతృప్తినిస్తుంది. చిత్రలహరి గురించి అందరూ ఎలా వెయిట్‌ చేసే వారు, అక్కడ జరిగే ప్రేమకథలా ఉంటుంది. 90వ దశకం రోజులను గుర్తకు తెస్తుంది. ఈ సినిమాలో మంచి ఎమోషన్‌ ఉంది. ఈ సినిమా క్లైమాక్స్ అందర్ని ఆలోచింపజేస్తుంది. సినిమా చూసిన వచ్చిన తరువాత ఆ ఫీల్‌ వదిలివెళ్లదు అని అన్నారు.

ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్ గురించి చెప్తూ.. ఆంధ్రాలో జరిగిన ఒక రియల్‌ ఇన్‌సిడెంట్‌ ఇది. ఇప్పుడు ఆ వ్యక్తి అరుణాచలంలో ఉన్నాడు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన లైఫ్‌ స్టోరియే సినిమా ఇది. ఆయన సొంత కొడుకు వల్ల ఇప్పుడు ఆయన బిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ కథ. సినిమాటిక్‌గా చాలా తక్కువగా ఉంటుంది. చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది అని అన్నారు.

Also Read : Suvikshit : క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్ చనిపోతారు.. అయినా హ్యాపీ ఎండింగ్..

ఈ సినిమా తర్వాత ఆగస్టు నుంచి ఓ పెద్ద సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాను అని తెలిపారు.