కంగనా అసలు నీ బాధేంటి?

మణికర్ణిక సినిమా విషయంలో దర్శకుడు క్రిష్, కంగనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.

  • Published By: sekhar ,Published On : January 31, 2019 / 05:34 AM IST
కంగనా అసలు నీ బాధేంటి?

Updated On : January 31, 2019 / 5:34 AM IST

మణికర్ణిక సినిమా విషయంలో దర్శకుడు క్రిష్, కంగనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మంచి నటి అనే సంగతి అందరికీ తెలిసిందే. తన టాలెంట్‌తో ముచ్చటగా మూడు నేషనల్ అవార్డ్స్ అందుకుంది. ఇందంతా కాయిన్‌కి ఒకవైపు అయితే, అప్పుడప్పుడూ ముక్కు సూటిగా మాట్లాడుతూ  వివిదాలకు తెరతీస్తుందనీ, దర్శకుల పనిలో కలగజేసుకుంటుందనీ ఆమె గురించి పలు వార్తలు వినబడుతుంటాయి. ఇప్పుడు కంగనా మణికర్ణిక సినిమా విషయంలో చేసిన పని గురించి, బాలీవుడ్‌తో పాటు, టాలీవుడ్‌లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కంగనా మెయిన్ లీడ్‌గా, వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జీవిత కథ ఆధారంగా రూపొందిన మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, జనవరి 25న రిలీజ్ అయ్యింది. దర్శకుడు క్రిష్‌తో పాటు, కొంత భాగాన్నికంగనా కూడా డైరెక్ట్ చేసింది. ట్రైలర్‌లో క్రిష్ పేరు పైనవేసి, తనపేరు కింద వేసుకుంది కంగనా. కట్ చేస్తే, సినిమా టైటిల్స్‌లో మాత్రం తనపేరే ముందు వేసుకుంది. వివాదాలకు దూరంగా ఉండే క్రిష్, తన బాధనంతటినీ బిగబట్టీ, బిగబట్టీ ఇప్పుడు బరస్ట్ అయ్యాడు.

సోషల్ మీడియా అండ్ మీడియా ద్వారా తన ఆవేదన అంతటినీ చెప్పుకుంటున్నాడు. తను దాదాపు 70 శాతం సినిమాని పూర్తిచేస్తే, తను అందుబాటులో లేని టైమ్‌లో నిర్మాతకి లేనిపోనివి చెప్పి, తనకిష్టమొచ్చినట్టు క్యారెక్టర్ల నిడివి తగ్గించడం, రీషూట్లు చెయ్యడం చేసిందనీ క్రిష్, కంగనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. క్రిష్ మామూలుగానే సైలెంట్.. తనపనేదో తాను చేసుకుపోయే టైపు. అలాంటి వ్యక్తి ఫస్ట్ టైమ్ తనకి అన్యాయం జరిగిందని చెప్పడం నిజంగా విచారించాల్సిన విషయమే. క్రిష్‌కి బాలీవుడ్ కొత్తేంకాదు.. 2015లో, అక్షయ్ కుమార్‌తో గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమా చేసాడు. మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ మూవీకది రీమేక్. అలాంటిది, క్రిష్‌లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ క్రియేటివిటీ తాలూకు క్రెడిట్ తీసుకుని ఏం చేద్దామనుకుందో కంగనా రనౌత్‌కే తెలియాలి.